Viral Video: వామ్మో.. ఇంత చిన్న చెప్పు కింద.. అంత పెద్ద పాము ఎలా దాక్కుందో మీరే చూడండి.. చూడకపోయి ఉంటే..!

ABN , First Publish Date - 2023-07-11T17:40:24+05:30 IST

విషసర్పాలు కొన్నిసార్లు ఉన్నట్టుండి ఊహించని ప్రదేశాల్లో ప్రత్యక్షమవుతుంటాయి. ఫ్రిడ్జ్ నుంచి బయటకొచ్చిన పాములను చూశాం.. షూ నుంచి బుసలుకొడుతూ పడగవిప్పిన కోబ్రాను చూశాం. అలాగే కారు ఇంజిన్, బైకులు, హెల్మెట్లలో నక్కిన పాములను కూడా చూశాం. ఇలాంటి ...

Viral Video: వామ్మో.. ఇంత చిన్న చెప్పు కింద.. అంత పెద్ద పాము ఎలా దాక్కుందో మీరే చూడండి.. చూడకపోయి ఉంటే..!

విషసర్పాలు కొన్నిసార్లు ఉన్నట్టుండి ఊహించని ప్రదేశాల్లో ప్రత్యక్షమవుతుంటాయి. ఫ్రిడ్జ్ నుంచి బయటకొచ్చిన పాములను చూశాం.. షూ నుంచి బుసలుకొడుతూ పడగవిప్పిన కోబ్రాను చూశాం. అలాగే కారు ఇంజిన్, బైకులు, హెల్మెట్లలో నక్కిన పాములను కూడా చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇంతకంటే ఆశ్చర్యానికి గురి చేసే వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. చెప్పుల కింద ఏదో ఉన్నట్లు అనుమానం వచ్చిన యువకుడు తీసి చూడగా.. ఓ నాగుపాము సడన్‌గా పడగ విప్పి బుసలు కొట్టింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఏ పుట్టలో ఏ పాము ఉందో అన్న చందంగా ఓ విష సర్పం ఊహించని ప్రదేశంలో కనిపించి.. అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఓ వ్యక్తి చెప్పులు వేసుకుందామని వెళ్లాడు. అయితే తీరా దగ్గరికి వెళ్లాక.. అతడికి అనుమానం కలిగింది. దీంతో ఓ చెప్పును పైకి తీసి, చూడగా.. ఆశ్చర్యకరంగా ఓ నాగుపాము చుట్ట చుట్టుకుని (snake hiding under a sandal) పడుకుని కనిపించింది. చెప్పు తీయగానే సడన్‌గా పైకి లేచి పడగ విప్పి బుసలు కొట్టింది.

Viral Video: వారెవ్వా.. ఏం తెలివయ్యా సామీ.. మ్యాన్‌హోల్స్‌లో పడిపోయి ప్రాణాలు పోకుండా ఉండేందుకు..!

ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. అయితే ముందే గుర్తించడంతో అంతా హమ్మయ్య! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! ఈ వీడియో చూస్తుంటే చెప్పులు వేసుకోవాలంటేనే భయంగా ఉంది’’.. అని కొందరు, ‘‘చెప్పులు, షూలు వేసుకునే మేము చాలా నిర్లక్ష్యంగా ఉంటాం’’.. అని మరికొందరు, ‘‘ఈ పాముకు చెప్పులే కనిపించాయా’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వేలల్లో లైకులను సొంతం చేసుకుంది.

Crocodiles vs Chicken: చుట్టూ వందల కొద్దీ మొసళ్లు.. మధ్యలో ఇరుక్కుపోయిన కోడి.. చివరకు జరిగిందేంటో మీరే చూడండి..!

Updated Date - 2023-07-11T17:40:24+05:30 IST