Crime News: వివాహమైన ఏడాదికే కోడలికి షాకింగ్ అనుభవం.. ఎవరూ లేనప్పుడు మద్యం తాగమంటూ మామ చెప్పడంతో..

ABN , First Publish Date - 2023-07-09T21:18:39+05:30 IST

వివాహమై అత్తారింటికి వచ్చిన మహిళల్లో చాలా మందికి వివిధ రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. కొందరు భర్త కారణంగా ఇబ్బంది పడితే, మరికొందరు అత్తమామల కారణంగా, ఇంకొందరు చుట్టు పక్కల వారితో నిత్యం వేధింపులను ఎదుర్కొంటుంటారు. అయినా..

Crime News: వివాహమైన ఏడాదికే కోడలికి షాకింగ్ అనుభవం.. ఎవరూ లేనప్పుడు మద్యం తాగమంటూ మామ చెప్పడంతో..
ప్రతీకాత్మక చిత్రం

వివాహమై అత్తారింటికి వచ్చిన మహిళల్లో చాలా మందికి వివిధ రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. కొందరు భర్త కారణంగా ఇబ్బంది పడితే, మరికొందరు అత్తమామల కారణంగా, ఇంకొందరు చుట్టు పక్కల వారితో నిత్యం వేధింపులను ఎదుర్కొంటుంటారు. అయినా కొందరు మహిళలు బాధలన్నింటినీ అలాగే భరిస్తూ ఉంటారు. మరికొందరు విసుగొచ్చి చివరకు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటుంటారు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో వివాహమైన ఏడాదికి ఓ మహిళకు వింత సమస్య వచ్చి పడింది. ఎవరూ లేనప్పుడు ఇంట్లోకి వచ్చిన మామ.. మద్యం తాగమంటూ కోడలిని బలవంతపెట్టాడు. చివరకు ఏమైందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బండాలోని కొత్వాలి ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన మహిళకు (woman) ఏడాది క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఆమె భర్త, అత్తమామలతో కలిసి ఉంటోంది. భర్త వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈమెకు మొన్నటి వరకూ ఎలాంటి సమస్యలూ లేవు. అయితే వివాహమైన (marriage) ఏదాడి తర్వాత అసలు సమస్యలు వచ్చి పడ్డాయి. అంతవరకూ బాగున్న ఆమె మామ ప్రవర్తనలో సడన్‌గా మార్పు వచ్చింది. ఇంట్లో అంతా ఉన్న సమయంలో మంచిగా ఉంటూ.. ఎవరూ లేని సమయంలో అతడి వక్ర బుద్ధి బయటపెట్టేవాడు. ఇటీవల ఓ రోజు మహిళ భర్త పొలం పనులకు వెళ్లాడు. ఇంట్లో మహిళ ఒక్కటి ఉండడాన్ని గమనించిన మామ (father-in-law).. లోపలికి వచ్చి కాసేపు సరదాగా మాట్లాడాడు.

Viral video: ఇదెక్కడి వింత!.. ఏటీఎం గదిలో ఇలాంటి దృశ్యం చూస్తామని ఎవరైనా ఊహిస్తామా...

ఈ క్రమంలో సడన్‌గా అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటూ మద్యం (alcohol) తాగమంటూ కోడలిని ఒత్తిడి చేశాడు. మామ ఉన్నట్టుండి ఇలా ప్రవర్తించడతో షాకైన ఆమె.. తన గదిలోకి పరుగెత్తుకుంటూ వెళ్లి తలుపు వేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తకు జరిగిన విషయం చెప్పింది. తండ్రిని మందలించాల్సిన అతను.. అందుకు విరుద్ధంగా భార్య పైనే దాడికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి భర్త, అత్తమామలు కలిసి అదనపు కట్నం పేరుతో వేధించేవారు. రోజు రోజుకూ వేధింపులు ఎక్కువ అవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. ఆమె భర్త, అత్తమామలపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Viral video: బోగీలో యువతి ప్రవర్తన చూసి బిత్తరపోయిన ప్రయాణికులు.. స్టేషన్‌లో రైలు ఆగగానే.. ఏం చేసిందో చూడండి..

Updated Date - 2023-07-09T21:18:39+05:30 IST