Viral Video: ఇతడి తెలివితేటలు అమోఘం.. కరెంట్ లేకుండానే పొలానికి నీళ్లు ఎలా వదులుతున్నాడో చూడండి..

ABN , First Publish Date - 2023-08-13T20:01:40+05:30 IST

కొందరికి అమితమైన తెలివితేటలు ఉన్నా.. సరైన ప్రోత్సాహం లేక మరుగున పడిపోతుంటారు. మరికొందరు తమ ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు అవసరమైన ఆర్థిక స్తోమత లేక మిన్నకుండిపోతుంటారు. అయితే ఇంకొందరు మాత్రం ఉన్న వనరులను, వస్తువులను సద్వినియోగం చేసుకుని.. చివరకు ..

Viral Video: ఇతడి తెలివితేటలు అమోఘం.. కరెంట్ లేకుండానే పొలానికి నీళ్లు ఎలా వదులుతున్నాడో చూడండి..

కొందరికి అమితమైన తెలివితేటలు ఉన్నా.. సరైన ప్రోత్సాహం లేక మరుగున పడిపోతుంటారు. మరికొందరు తమ ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు అవసరమైన ఆర్థిక స్తోమత లేక మిన్నకుండిపోతుంటారు. అయితే ఇంకొందరు మాత్రం ఉన్న వనరులను, వస్తువులను సద్వినియోగం చేసుకుని.. చివరకు అద్భుతాలను సృష్టిస్తుంటారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు కరెంట్ అవసరం లేకుండానే పొలానికి నీళ్లు వదులుతున్నాడు. ఇతడి తెలివితేటలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన పొలానికి నీళ్లు పట్టేందుకు విద్యుత్ (electricity) అవసరం లేకుండా నడిచే మోటార్‌ను తయారు చేశాడు. ఇందుకోసం బోరు మోటారు ఎదురుగా ఓ స్టాండ్‌పై మోటారుతో (motor) పాటూ ఓ చక్రాన్ని కూడా అమర్చాడు. ముందు చేత్తో కొద్ది సేపు చక్రాన్ని తిప్పడం వల్ల పైపు నుంచి నీళ్లు బయటికి వచ్చాయి. వేగంగా వచ్చిన నీరంతా.. ఎదురుగా ఉన్న చక్రంపై పడ్డాయి. దీంతో చక్రం అత్యంత వేగంగా తిరగడం వల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.

Crime News: ప్రభుత్వ పథకం కింద ఫ్రీ మొబైల్ ఇస్తామంటూ.. ఇంటికి వెళ్లి చెప్పిన ఉద్యోగి.. బాలిక ఎంతో సంతోషంతో వెనుకే వెళ్లగా..

దీంతో అటు మోటారు తిరగడంతో పాటూ ఇటు పొలానికి నీళ్లు కూడా వెళ్తున్నాయి. పక్కనే ఓ బోర్డు ఏర్పాటు చేసి, దానిపై బల్పులను ఏర్పాటు చేశాడు. ఆన్ చేయగా ఆశ్చర్యకంరగా అన్నీ వెలుగుతూ ఉంటాయి. ఇలా ఫ్రీగా విద్యుత్ ఉత్పత్తి చేయడమే కాకుండా పొలానికి నీళ్లు కూడా పడుతున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వారిని ప్రోత్సహించాలి’’.. అంటూ కొందరు, ‘‘ఈ రైతు తెలివితేటలు అద్భుతం’’.. అంటూ ఇంకొందరు, ‘‘రైతులకు ఇది బాగా ఉపయోగపడుతుంది’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: బాత్రూంలోకి వెళ్లిన మహిళ.. అనుమానం వచ్చి తొంగిచూడగా షాకింగ్ సీన్.. చివరకు ఆమె చేసిన పని చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Updated Date - 2023-08-13T20:01:40+05:30 IST