Viral Video: ఇలాంటి కారును ఇండియాలో మాత్రమే చూడగలం.. ఇంతకీ ఇతడి తెలివితేటలు చూస్తే అవాక్కవడం ఖాయం..

ABN , First Publish Date - 2023-09-16T20:36:29+05:30 IST

కొందరు అందుబాటులో ఉన్న వనరులతోనే తమకు కావాల్సిన వస్తువులు తయారు చేసుకుని, అందులోనే ఆనందాన్ని పొందుతుంటారు. ఇంకొందరు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగేలా వివిధ రకాల ఆవిష్కరణలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరి తెలివితేటలు చూస్తే ...

Viral Video: ఇలాంటి కారును ఇండియాలో మాత్రమే చూడగలం.. ఇంతకీ ఇతడి తెలివితేటలు చూస్తే అవాక్కవడం ఖాయం..

కొందరు అందుబాటులో ఉన్న వనరులతోనే తమకు కావాల్సిన వస్తువులు తయారు చేసుకుని, అందులోనే ఆనందాన్ని పొందుతుంటారు. ఇంకొందరు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగేలా వివిధ రకాల ఆవిష్కరణలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరి తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. పాత, పాడైన వాహనాలను తమ ప్రతిభతో సరికొత్తగా మార్చి తద్వారా అందరి ప్రశంసలు అందుకునే వారిని చాలా మందిని చూస్తూ ఉంటాం. తాజాగా, ఇలాంటి వ్యక్తికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇతడు తయారు చేసిన కారును చూసి.. ‘‘ఇలాంటి కారును ఇండియాలో మాత్రమే చూడగలం’’.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఆటో నడుపుతున్న ఓ వ్యక్తి.. కారు కొనాలని అనుకున్నాడు. అయితే అందుకు తగ్గ బడ్జెట్ తన వద్ద లేకపోవడంతో నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చాడు. అయితే చివరకు ఎలాగైనా కారు కావాలనే ఉద్దేశంతో ఆటోనే కారుగా మార్చాలని అనుకున్నాడు. ఇందుకోసం ముందు భాగాన్ని అలాగే ఉంచి, వెనుక భాగం మొత్తం కారు ఆకారంలో (man converted an auto into car) తయారు చేశాడు. పాత కారుకు సంబంధించిన విడిభాగాలను ఆటోకు వెనుక భాగంలో అమర్చాడు.

Buying a Car: కారును కొనే ఆలోచనలో ఉన్నారా..? అయితే ముందే ఈ 20/4/10 రూల్‌ను తెలుసుకోండి..!

ముందు వైపు డ్రైవర్ ఉన్న ప్రాంతం మినహా.. వెనుక వైపు మొత్తం అచ్చం కారులోనే తయారు చేశాడు. చూడటానికి వెనుక వైపు సీటులో ఉన్న వారికి కారులో ఉన్నట్లు అనిపించేలా ఏర్పాట్లు చేశాడు. ఈ కారు వంటి ఆటోను చూసి మిగతా వాహనదారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెనుక వైపు ఇంకో కారులో వెళ్తున్న వారు ఈ వింత కారును వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘వావ్! ఇతడి ఆవిష్కరణ అద్భుతం’’.. అంటూ కొందరు, ‘‘ఒకే ప్రయాణంలో రెండు రకాల ఫీలింగ్స్ అంటే ఇదేనేమో’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి తెలివితేటలు ఇండియా వారికే సాధ్యం’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Sourabh Chandrakar: ఎవరీ చంద్రశేఖర్..? గల్ఫ్ గడ్డపై పెళ్లి కోసం రూ.200 కోట్ల ఖర్చు.. క్యూ కట్టిన బాలీవుడ్ సెలబ్రెటీలు..!

Updated Date - 2023-09-16T20:36:29+05:30 IST