Viral Video: నిండా పదేళ్లు కూడా లేవు.. ఇంత టాలెంట్ ఏంటి తల్లీ..? ఇంగ్లీషు పాఠాలు ఎలా చెప్పేస్తోందో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-09-16T14:52:01+05:30 IST

కొందరు పిల్లలకు చదువు నేర్పించాలంటే తల ప్రాణం తోకకు వస్తుంటుంది. అయితే మరికొందరు పిల్లలు మాత్రం.. ఇలా చెప్పగానే అలా నేర్చేసుకుంటుంటారు. అదేవిధంగా ఇంకొందరు పిల్లలైతే.. నేర్చుకోవడమే కాకుండా గుర్తుపెట్టకుని, సందర్భం వచ్చినప్పుడు వాటిని పెద్ద వాళ్లకూ గుర్తు చేసి.. ...

Viral Video: నిండా పదేళ్లు కూడా లేవు.. ఇంత టాలెంట్ ఏంటి తల్లీ..? ఇంగ్లీషు పాఠాలు ఎలా చెప్పేస్తోందో మీరే చూడండి..!

కొందరు పిల్లలకు చదువు నేర్పించాలంటే తల ప్రాణం తోకకు వస్తుంటుంది. అయితే మరికొందరు పిల్లలు మాత్రం.. ఇలా చెప్పగానే అలా నేర్చేసుకుంటుంటారు. అదేవిధంగా ఇంకొందరు పిల్లలైతే.. నేర్చుకోవడమే కాకుండా గుర్తుపెట్టకుని, సందర్భం వచ్చినప్పుడు వాటిని పెద్ద వాళ్లకూ గుర్తు చేసి.. వారి తప్పులను కూడా సరిదిద్దుతుంటారు. ఇలాంటి పిల్లలను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. చిన్నతనంలోనే అమితమైన తెలివితేటలను సొంతం చేసుకునే ఇలాంటి పిల్లలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఓ చిన్నారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది. నిండా పదేళ్లు లేని ఓ పాప.. ఇంగ్లీష్ పాఠాలు చెప్పడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ చిన్నారి (little girl) క్లాసు రూమ్‌లో బోర్డుపై Door, Teacher, War, Water, Letter అనే ఇంగ్లీష్ పదాలను రాస్తుంది. తర్వాత ఆ పదాలను ఒక్కొక్కటిగా ఎలా పలకాలనే (Way of pronouncing words) దానిపై అక్కడు ఉన్న మహిళకు వివరిస్తుంది. బోర్డుపై ఉన్న పదాన్ని పలకగానే.. ఆమె వైపు కోపంగా చూసి.. ‘‘అలా కాదు.. అక్కడ ఆర్ సైలెంట్.. కాబట్టి ఇలా పలకాలి’’.. అని ఎలా పలకాలో వివరంగా చెబుతుంది. ఇలా బోర్డుపై ఉన్న అన్ని పదాలనూ ఎలా పలకాలలో వివరిస్తుంది.

Viral Video: ఫ్రాంక్ వీడియోలు చేసే యూట్యూబర్.. ఇలా చేశాడేంటి..? చొక్కావిప్పి.. ఓ ప్లాస్టిక్ కవర్‌ను చుట్టుకుని..!

ఆ పాప ముద్దు ముద్దుగా చెబుతోంటో.. ఎదురుగా ఉన్న మహిళ తదేకంగా చూస్తూ చిన్నారి చెప్పింది ఆసక్తిగా వింటూ ఉండిపోతుంది. అలాగే ఆ పాపను ట్యాలెంట్ అందరికీ తెలిసేలా.. వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ చిన్నారి ఎవరోగానీ.. భవిష్యత్‌లో పెద్ద టీచర్ అవుతుంది’’.. అని కొందరు, ‘‘ఇంత చిన్న వయసులో ఎన్ని తెలివితేటలు’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి పిల్లలను ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించాలి’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: గ్యాస్ లీక్ అవుతున్నట్లు ఒకటే శబ్ధం వస్తోంటే చూసేందుకు వెళ్లింది.. అయితే చివరికి ఇలాంటి సీన్ చూడాల్సి వస్తుందని ఊహించి ఉండదు..

Updated Date - 2023-09-16T14:53:32+05:30 IST