Wife: పుట్టిన రోజు వేడుకలకు వెళ్లిన భర్త.. రాత్రికి రాత్రే అనుమానాస్పద మృతి.. ఆ భార్య చెబుతున్న నిజాలివీ..!

ABN , First Publish Date - 2023-09-15T16:52:44+05:30 IST

కుటుంబ సభ్యులతో సంతోషంగా సాగుతున్న అతడిలో జీవితంలో చోటు చేసుకున్న అనూహ్య ఘటన చివరకు విషాదాంతంగా మారింది. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్న అతడు.. ఎవరూ ఊహించని విధంగా తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు. పుట్టిన రోజు వేడుకలకు వెళ్లిన అతను...

Wife: పుట్టిన రోజు వేడుకలకు వెళ్లిన భర్త.. రాత్రికి రాత్రే అనుమానాస్పద మృతి.. ఆ భార్య చెబుతున్న నిజాలివీ..!
ప్రతీకాత్మక చిత్రం

కుటుంబ సభ్యులతో సంతోషంగా సాగుతున్న అతడిలో జీవితంలో చోటు చేసుకున్న అనూహ్య ఘటన చివరకు విషాదాంతంగా మారింది. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్న అతడు.. ఎవరూ ఊహించని విధంగా తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు. పుట్టిన రోజు వేడుకలకు వెళ్లిన అతను రాత్రికి రాత్రే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే భర్త మృతి గురించి భార్య చెబుతున్న నిజాలు విని అంతా షాక్ అవుతున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌కు (Delhi Gurugram) చెందిన విక్రమ్ (35) అనే వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విక్రమ్ ప్రస్తుతం ఫార్మకాలజీ కోర్సు (Pharmacology course) చదువుతున్నాడు. ఇదిలావుండగా, విక్రమ్‍‌కు కొన్ని నెలల కిందట 20 ఏళ్ల యువతి (young woman) పరిచయమైంది. కోర్సుకు వెళ్లే సమయంలో విక్రమ్‌కు ఆమెకు మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇటీవల ఓ రోజు విక్రమ్ పుట్టిన రోజు (birthday) కావడంతో సదరు యువతితో కలిసి వేడుకలు చేసుకునేందుకు గెస్ట్ హౌస్‌కు వెళ్లాడు. అయితే ఆశ్చర్యకరంగా ఉదయం గదిలో ఊరికి వేలాడుతూ కనిపించాడు. ఆత్మహత్య (suicide) చేసుకునే సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ (Instagram Live) వీడియో ఆన్ చేశాడు.

Viral Video: వర్షం వస్తోందని చెట్టు కిందకు వెళ్లిన మహిళలు.. కాసేపటికి అంతా చూస్తుండగా ఒక్కసారిగా ఏం జరిగిందో చూడండి..

ఈ వీడియో ప్రస్తుతం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మృతుడి భార్య సంచలన నిజాలను బయటపెట్టింది. ఆమె చెప్పిన కథనం మేరకు.. విక్రమ్‌ను సదరు యువతి కొన్ని నెలలుగా బ్లాక్‌మెయిల్ చేస్తోంది. అసభ్యకర వీడియోలు చూపించి, అందరిలో పరువు తీస్తానంటూ బెదిరించేది. ఇలా దఫాలుగా అతని నుంచి రూ.2లక్షలు వసూలు చేసింది. అయినా మళ్లీ బెదిరిస్తుండడంతో విక్రమ్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. తన భర్త ఆత్మహత్య చేసుకున్న సమయంలోనూ యువతి అక్కడే ఉందని, అయినా ఆత్మహత్యను ఆపలేదని మృతుడి భార్య ఆరోపిస్తుంది. విక్రమ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: బాబోయ్.. ఏం చేస్తున్నాడని అవాక్కవుతున్నారా..? భార్యను పిలిచి.. గ్యాస్ లైటర్‌ను కాల్చి.. జుట్టుకు చుట్టి..!

Updated Date - 2023-09-15T16:52:44+05:30 IST