Viral Video: వారెవ్వా.. తెలివంటే నీదే కదా బ్రదర్.. పాత కారులో ఒక్క చిన్న మార్పు చేసి.. ట్రెండ్‌లోకి వచ్చేలా చేశాడుగా..!

ABN , First Publish Date - 2023-06-09T16:17:13+05:30 IST

పాత వస్తువులను కొందరు కేజీల లెక్కన విక్రయిస్తే.. మరికొందరు ఏళ్లకు ఏళ్లు మూలన పడేస్తుంటారు. అయితే ఇంకొందరు మాత్రం వారి మెదడుకు పని పెట్టి.. పాత వాటిని సరికొత్తగా మార్చేస్తుంటారు. ఇలాంటి వినూత్న ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ..

Viral Video: వారెవ్వా.. తెలివంటే నీదే కదా బ్రదర్.. పాత కారులో ఒక్క చిన్న మార్పు చేసి.. ట్రెండ్‌లోకి వచ్చేలా చేశాడుగా..!

పాత వస్తువులను కొందరు కేజీల లెక్కన విక్రయిస్తే.. మరికొందరు ఏళ్లకు ఏళ్లు మూలన పడేస్తుంటారు. అయితే ఇంకొందరు మాత్రం వారి మెదడుకు పని పెట్టి.. పాత వాటిని సరికొత్తగా మార్చేస్తుంటారు. ఇలాంటి వినూత్న ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. పాత కారులో చిన్న మార్పు చేసి, ట్రెండ్‌లోకి వచ్చేలా చేశాడు. ఈ వాహనాన్ని చూసిన నెటిజన్లు.. వారెవ్వా.. తెలివంటే నీదే కదా బ్రదర్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral videos) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన పాత మారుతి-800 (Maruti-800) కారును పక్కన పడేయకుండా వినియోగంలోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అది కూడా సరికొత్తగా మార్చి.. లేటెస్ట్ వాహనాలకు తీసిపోకుండా తయారు చేయాలని ఆలోచించాడు. ఇందుకోసం వివిధ రకాలుగా మార్పులు చేసి.. చివరకు సరికొత్తగా మార్చాడు. పెద్ద సైజు టైర్లను (Big size tires) తీసుకుని మారుతి కారుకు అమర్చాడు. దీంతో కారు ఎత్తు అమాంతం పెరిగిపోయింది. చూసేందుకు, మార్కెట్‌లోకి వచ్చిన సరికొత్త వాహనం తరహాలో తీర్చిదిద్దాడు.

Metro Train: మెట్రో రైల్లో కుర్రాళ్ల బ్యాచ్.. డోర్ల వద్ద కావాలనే నిల్చుని పిచ్చి చేష్టలు.. సీక్రెట్‌గా ఓ వ్యక్తి వీడియో తీయడంతో..!

రోడ్ల మీద పరుగులు పెడుతున్న మారుతి వాహనం చూసి మిగతా వాహనదారులు షాక్ అయ్యారు. ఇదేంటీ.. మరీ విచిత్రంగా ఉందే.. అంటూ చర్చించుకున్నారు. మరో వాహనంలో వెళ్తున్న వారు.. మారుతి వాహనాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్! పాత కారును అద్భుతంగా మార్చారు’’.. అంటూ కొందరు, ‘‘ మీ తెలివికి హాట్సాప్ బ్రదర్’’.. అంటూ మరికొందరు, ‘‘తండ్రి బూట్ల మీద పిల్లాడిని పెట్టినట్లు ఉంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Bride: కాసేపట్లో పెళ్లనగా భారీ షాకిచ్చిన వధువు.. అప్పటికప్పుడు వేరే యువతితో వరుడికి పెళ్లి.. ఎందుకిలా చేశావని ఆ వధువును నిలదీస్తే..!

Updated Date - 2023-06-09T16:17:13+05:30 IST