Metro Train: మెట్రో రైల్లో కుర్రాళ్ల బ్యాచ్.. డోర్ల వద్ద కావాలనే నిల్చుని పిచ్చి చేష్టలు.. సీక్రెట్‌గా ఓ వ్యక్తి వీడియో తీయడంతో..!

ABN , First Publish Date - 2023-06-09T15:36:09+05:30 IST

చాలా మంది ఆకతాయిలు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయడం సర్వ సాధారణమైంది. వీరిలో కొందరు జంతువులను హింసిస్తూ వీడియోలు చేస్తుంటే, మరికొందరు జన సంచార ప్రదేశాల్లో ప్రాంక్ వీడియోలు చేస్తూ అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తుంటారు. ఇటీవల..

Metro Train: మెట్రో రైల్లో కుర్రాళ్ల బ్యాచ్.. డోర్ల వద్ద కావాలనే నిల్చుని పిచ్చి చేష్టలు.. సీక్రెట్‌గా ఓ వ్యక్తి వీడియో తీయడంతో..!

చాలా మంది ఆకతాయిలు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయడం సర్వ సాధారణమైంది. వీరిలో కొందరు జంతువులను హింసిస్తూ వీడియోలు చేస్తుంటే, మరికొందరు జన సంచార ప్రదేశాల్లో ప్రాంక్ వీడియోలు చేస్తూ అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తుంటారు. ఇటీవల ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మెట్రో రైల్లో కొందరు కుర్రాళ్లు చేసిన పిచ్చి చేష్టలకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. డోర్ వద్ద నిల్చుని వారు చేసిన పని చూసి నెటిజన్లు మండిపడుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఢిల్లీ మెట్రో రైల్లో (Delhi Metro Rail) ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు కరోల్ బాగ్ స్టేషన్ వద్ద ఆగగానే డోర్లు ఆటోమేటిక్‌గా తెరుచుకున్నాయి. కొందరు కుర్రాళ్ల రైల్లోకి ఎక్కారు.. కానీ డోరు వద్దనే నిల్చున్నారు. సాధారణంగా ప్రయాణికులు ఎక్కగానే డోర్లు మళ్లీ ఆటోమేటిక్‌గా (Automatic doors) మూసుకుపోవడం సర్వసాధారణం. అయితే ఎవరైనా డోరు మధ్యలోకి వస్తే.. సడన్‌గా తెరుచుకుంటాయి. రైలు ఎక్కిన యువకులు డోరు వద్ద నిల్చుని.. తీరా మూసుకుపోయే సమయంలో కాళ్లు అడ్డుపెట్టారు. దీంతో డోర్లు మళ్లీ తెరుచుకున్నాయి. మాటి మాటికీ ఇలాగే చేస్తుండడంతో డోర్లు తెరచుకోవడం, మూసుకుపోవడం జరుగుతూ ఉంది.

Viral News: వావ్! ఈ మహిళ చేసిన ఒక్క పనితో.. మద్యం బాటిల్‌ని ఎత్తుకెళ్లిన దొంగ పరిస్థితి చివరకు ఏమైందంటే..

యువకులు అలా చేస్తూ ఉండడంతో రైలు కదలకుండా చాలా సేపు అక్కడే ఉంది. వీరి పిచ్చి చేష్టలను చూసి పక్కన ఉన్న యువకులు నవ్వుకుంటూ ఉన్నారు. కొందరు వారిని వారించే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. ఈ ఘటనను అక్కడే ఉన్న కొంతమంది వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం (Netizens are angry) వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ‘‘ఇలాంటి వారి వల్లే మెట్రో రైళ్లు ఆలస్యం అవుతున్నాయి’’.. అని కొందరు, ‘‘ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయకుండా వీరిని కఠినంగా శిక్షించాలి’’.. అని మరికొందరు, ‘‘వీరికి రూ.50000 ఫైన్ వేయాలి’’.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

Crime News: టీ తాగేందుకు హోటల్‌కు వెళ్లిన పోలీసులు.. సడన్‌గా వచ్చిన ఆటోను చూసి డౌట్.. ఫోన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని మరోసారి చూసి..

Updated Date - 2023-06-09T15:36:09+05:30 IST