Viral Video: బైక్‌పై వెళ్తూ ఇదేం పనయ్యా బాబూ.. మీలాంటి వాళ్ల వల్లే కదా.. అమాయక జనాల ప్రాణాలు పోతున్నాయ్..!

ABN , First Publish Date - 2023-06-08T14:50:31+05:30 IST

చాలా మంది యువతీయువకులు వివిధ రకాల విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటారు. కొందరైతే అత్యంత ప్రమాదకర విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. మరికొందరు ఏదో చేయాలని ప్రయత్నించి చివరకు ప్రమాదాల బారిన పడుతుంటారు. ఇలాంటి..

Viral Video: బైక్‌పై వెళ్తూ ఇదేం పనయ్యా బాబూ.. మీలాంటి వాళ్ల వల్లే కదా.. అమాయక జనాల ప్రాణాలు పోతున్నాయ్..!

చాలా మంది యువతీయువకులు వివిధ రకాల విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటారు. కొందరైతే అత్యంత ప్రమాదకర విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. మరికొందరు ఏదో చేయాలని ప్రయత్నించి చివరకు ప్రమాదాల బారిన పడుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వ్యక్తి బైకుపై చేసిన విన్యాసానికి (Bike Stunts) సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసి.. బైక్‌పై వెళ్తూ ఇదేం పనయ్యా బాబూ.. మీలాంటి వాళ్ల వల్లే కదా.. అమాయక జనాల ప్రాణాలు పోతున్నాయ్..! అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral videos) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రద్దీగా ఉన్న రోడ్డుపైకి బైకులో (bike) వస్తాడు. కాసేపటికి హ్యాండిల్ వదిలేసి పూర్తి వెనక్కు జరిగి ఓ వైపు తిరిగి కూర్చున్నాడు. అది కూడా దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చుని.. అంతటితో ఆగకుండా ఫోన్‌లో (Phone) ఎవరితోనో తాపీగా మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు బైకు స్పీడ్‌గా వెళ్తూ ఉంటుంది. లారీలు, కార్ల మధ్య నుంచి దూసుకెళ్తాడు. ఆ సమయంలో ఏమాత్రం బైకు అదుపు తప్పినా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది.

Woman: జైల్లో ఉన్న భర్తను కలిసేందుకు వెళ్లిన భార్య.. చూసిన మరుక్షణమే ఆమె పరిస్థితిని చూసి షాకైన పోలీసులు.. చివరకు ఏం జరిగిందంటే..

ఈ వ్యక్తి పిచ్చి చేష్టలను చూసి పక్కన వెళ్తున్న వాహనదారులు షాక్ అయ్యారు. కారులో వెళ్తున్న ఓ వ్యక్తి.. అతన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ‘‘ఇలాంటి పిచ్చి పనులు చేసే వారి వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి’’.. అని కొందరు, ‘‘ ఫోన్‌లో యమ ధర్మరాజుతో మాట్లాడుతున్నట్లు ఉన్నాడు’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి ప్రయత్నాలు ఎవరూ చేయొద్దు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: చికెన్ బిర్యానీ కోసం వీళ్ల కక్కుర్తి చూడండి.. తలుపు చాటున నిలబడి చివరకు ఎలాంటి ప్లాన్ వేశారంటే..

Updated Date - 2023-06-08T14:50:31+05:30 IST