Viral Video: కేవైసీ కోసం బ్యాంక్‌కు వచ్చి ఉన్నట్టుండీ పిచ్చి పనులేంటమ్మా... మహిళ నిర్వాకం చూసి విస్తుపోతున్న నెటిజనం..

ABN , First Publish Date - 2023-06-07T16:43:10+05:30 IST

ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో మనిషి నిత్యం వివిధ రకాల సమస్యలతో సతమతమవుతున్నాడు. కొందరు పని ఒత్తిడి కారణంగా ఇబ్బందులు పడుతుంటే.. మరికొందరు మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ఏం చేస్తున్నారో..

Viral Video: కేవైసీ కోసం బ్యాంక్‌కు వచ్చి ఉన్నట్టుండీ పిచ్చి పనులేంటమ్మా... మహిళ నిర్వాకం చూసి విస్తుపోతున్న నెటిజనం..

ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో మనిషి నిత్యం వివిధ రకాల సమస్యలతో సతమతమవుతున్నాడు. కొందరు పని ఒత్తిడి కారణంగా ఇబ్బందులు పడుతుంటే.. మరికొందరు మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ఏం చేస్తున్నారో వారికే తెలీనంతగా ప్రవర్తిస్తుంటారు. ఇటీవల చాలా మంది యువతులు, మహిళలు.. జన సంచారం ఉన్న ప్రాంతాల్లో పిచ్చి పిచ్చి పనులు చేయడం చూస్తున్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఓ మహిళకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కేవైసీ కోసం బ్యాంక్‌కు వచ్చిన మహిళ.. ఉన్నట్టుండి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం చూసి అంతా అవాక్కవుతున్నారు.

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) గుణ జిల్లాలోని ఎస్‌బీఐ బ్యాంక్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Chief Minister Shivraj Singh Chouhan) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లాడ్లీ బెహనా యోజన పథకం (ladli behna yojana) ద్వారా వచ్చే డబ్బుల కోసం గుణ జిల్లాలో మహిళంతా బ్యాంకులకు వెళ్లి కేవైసీ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ మహిళ కేవైసీ (KYC) చేయించుకునేందుకు ఎస్‌బీఐ బ్యాంక్‌కు (SBI Bank) వచ్చింది. ఈ క్రమంలో క్యూలో నిలబడి వేచి చూస్తూ ఉంది. అయితే అంతలో ఉన్నట్టుండి అంతా షాక్ అయ్యేలా ప్రవర్తించింది.

Crime News: తాతా.. నేనూ అటే వెళ్తున్నా.. లిఫ్ట్ ఇస్తా అనగానే.. ఆ కుర్రాడి బైక్‌ను ఎక్కిన వృద్ధుడు.. బస్సులో వస్తానులే అని చెప్పి ఉంటే..!

క్యూలో ఉన్న సదరు మహిళ.. ఒక్కసారిగా పూనకం వచ్చినట్లుగా ఊగిపోయింది. జుట్టు విరబోసుకుని, కేకలు పెడుతూ అటూ ఇటూ పరుగెడుతూ అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. మధ్య మధ్యలో గిరాగిరా తిరుగుతూ డాన్సు వేయడం, నేలపై కూర్చుని ఊగుతూ పిచ్చిపిచ్చిగా అరవడం మొదలెట్టింది. అప్పటిదాకా బాగున్న మహిళ.. ఉన్నట్టుండి ఇలా చేసేసరికి అంతా షాక్ అయ్యారు. కాగా, ఈ వీడియో (Viral video) ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: వీరు ఇక్కడే ఇలా వుంటే.. ఇక ఇంట్లో ఎలా వుంటారో.. మెట్రో రైల్లో మహిళల నిర్వాకంపై ముక్కున వేలేసుకుంటున్న నెటిజన్లు..

Updated Date - 2023-06-07T16:43:10+05:30 IST