Viral Video: ఈ ఏనుగు ముందు యోగా మాస్టర్ కూడా దిగదుడుపే.. కావాలంటే మీరే చూడండి..

ABN , First Publish Date - 2023-06-06T21:46:30+05:30 IST

కొన్ని జంతువులు చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటాయి. కొన్నిసార్లు కుక్కలు, కోతులు, ఏనుగులు తదితర జంతువులు.. చిత్రచిత్రమైన పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటి జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ ఏనుగుకు సంబంధించిన..

Viral Video: ఈ ఏనుగు ముందు యోగా మాస్టర్ కూడా దిగదుడుపే.. కావాలంటే మీరే చూడండి..

కొన్ని జంతువులు చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటాయి. కొన్నిసార్లు కుక్కలు, కోతులు, ఏనుగులు తదితర జంతువులు.. చిత్రచిత్రమైన పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటి జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మహిళా కేర్ టేకర్ ముందు ఓ ఏనుగు వేసిన యోగాసనాలు చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏనుగు ముందు యోగా మాస్టర్ కూడా దిగదుడుపే.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

UKలోని హ్యూస్టన్ జంతు ప్రదర్శనశాలలో (Zoo) యోగా చేస్తున్న ఏనుగులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. 40 ఏళ్ల వయసున్న ఓ ఏనుగు (elephant) వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. మహిళా కేర్ టేకర్ (Female Caretaker) సూచనలను తూచా తప్పకుండా పాటించిన ఏనుగు.. వివిధ రకాల యోగాసనాలను (Yoga Asanas) వేసింది. 6,500 పౌండ్ల తన శరీరాన్ని ముందు కాళ్ల పైకి ఎత్తి అలాగే బ్యాలెన్స్ చేస్తుంది. అనంతరం కేర్ టేకర్ సూచలను పాటిస్తూ ఒంటి కాలిని పైకి లేపడం, ముందు కాళ్ల మీద ముందుకు వంగి యోగాసనం వేయడం చూసి సందర్శకులు షాక్ అవుతున్నారు.

Women Crime News: వేసిన తలుపులు వేసినట్లే ఉన్నా.. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన యువకుడు.. మహిళ చెప్పింది విని పరుగెత్తుకుంటూ వెళ్లిన స్థానికులు.. చివరకు..

ప్రతి రోజూ ఏనుగులకు యోగా శిక్షణ ఇస్తున్నట్లు జూ నిర్వాహకులు తెలిపారు. తద్వారా వాటి ఎముకలు బలంగా ఉండడంతో పాటూ ఆరోగ్యంగా కూడా ఉంటాయన్నారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఏనుగును చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాలి’’.. అని కొందరు, ‘‘యోగా మాస్టర్ కూడా ఈ ఏనుగు ముందు దిగదుడుపే’’. .. అని మరికొందరు, ‘‘ఈ ఏనుగును చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: వీరు ఇక్కడే ఇలా వుంటే.. ఇక ఇంట్లో ఎలా వుంటారో.. మెట్రో రైల్లో మహిళల నిర్వాకంపై ముక్కున వేలేసుకుంటున్న నెటిజన్లు..

Updated Date - 2023-06-06T21:49:51+05:30 IST