Viral Video: చికెన్ బిర్యానీ కోసం వీళ్ల కక్కుర్తి చూడండి.. తలుపు చాటున నిలబడి చివరకు ఎలాంటి ప్లాన్ వేశారంటే..

ABN , First Publish Date - 2023-06-07T20:46:04+05:30 IST

చాలా మంది ఎలాంటి కష్టం లేకుండా, రూపాయి ఖర్చు కాకుండా అన్నీ ఫ్రీగా వచ్చేయాలని ఆశపడుతుంటారు. ఎవరైనా అలాంటి ఆఫర్ ఇస్తే ఎగబడి మరీ వాటిని సొంతం చేసుకుంటుంటారు. మరికొందరు ఆఖరికి తిండి విషయంలో కూడా కక్కుర్తి పనులు చేస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు..

Viral Video: చికెన్ బిర్యానీ కోసం వీళ్ల కక్కుర్తి చూడండి.. తలుపు చాటున నిలబడి చివరకు ఎలాంటి ప్లాన్ వేశారంటే..

చాలా మంది ఎలాంటి కష్టం లేకుండా, రూపాయి ఖర్చు కాకుండా అన్నీ ఫ్రీగా వచ్చేయాలని ఆశపడుతుంటారు. ఎవరైనా అలాంటి ఆఫర్ ఇస్తే ఎగబడి మరీ వాటిని సొంతం చేసుకుంటుంటారు. మరికొందరు ఆఖరికి తిండి విషయంలో కూడా కక్కుర్తి పనులు చేస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ దర్శనమిస్తుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కొందరు యువకులు చికెన్ బిర్యానీ కోసం మాస్టర్ ప్లాన్ వేశారు. తలుపు చాటున నిలబడి వీళ్లు చేసిన పని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. కొందరు యువకులు చికెన్ బిర్యానీ (Chicken biryani) చేసుకోవాలని అనుకుంటారు. అయితే ఇందుకోసం రూపాయి ఖర్చు చేయకుండా ఫ్రీగా కావాలని కోరుకుంటారు. ఇంకేముందీ వారి కన్ను వెంటనే పక్కింటి కోళ్లపై పడుతుంది. దొంగ కోళ్లు పట్టేందుకు చాలా శ్రమిస్తారు. కానీ అది సాధ్యం కాకపోవడంతో చివరకు మాస్టార్ ప్లాన్ వేస్తారు. ఇద్దరు యువకులు ముందుగా తమ ఇంటి ముంగిట్లో కొన్ని గింజలు వేసి, తలుపు చాటున నిలబడతారు. కొద్ది సేపటికి కొన్ని కోళ్లు (chickens) లోపలికి వచ్చి గింజలు తింటూ ఉంటాయి.

Viral Video: కేవైసీ కోసం బ్యాంక్‌కు వచ్చి ఉన్నట్టుండీ పిచ్చి పనులేంటమ్మా... మహిళ నిర్వాకం చూసి విస్తుపోతున్న నెటిజనం..

కోళ్లు లోపలికి రాగానే.. ఇదే మంచి తరుణం అనుకుని వెంటనే తలుపును చూసేస్తారు. తర్వాత పక్కనే ఉన్న మరికొంతమంది యువకులు పరుగెత్తుకుంటూ వస్తారు. ‘‘అబ్బా! ఎన్ని కోళ్లో.. ఈ రోజు మనకు పండుగే’’.. లోపలికి వచ్చిన కోళ్లన్నింటినీ పట్టేందుకు (youth caught neighbor hens) ప్రయత్నిస్తారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు (Funny comments) చేస్తున్నారు. ‘‘మీ కక్కుర్తి తగలెయ్య’’.. అని కొందరు, ‘‘నాటు కోడి బిర్యాని వారానికి సరిపడా దొరికేసింది’’.. అని మరికొందరు, ‘‘ఆహా! ఇక ఫుల్ పార్టీయే’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: వీరు ఇక్కడే ఇలా వుంటే.. ఇక ఇంట్లో ఎలా వుంటారో.. మెట్రో రైల్లో మహిళల నిర్వాకంపై ముక్కున వేలేసుకుంటున్న నెటిజన్లు..

Updated Date - 2023-06-07T20:46:04+05:30 IST