Crime news: గంటల వ్యవధిలో ఇద్దరు కూతుళ్లకు కడుపు నొప్పి.. కంగారుగా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చివరకు వారు చెప్పింది ఏంటంటే..

ABN , First Publish Date - 2023-08-02T21:51:56+05:30 IST

ప్రస్తుతం చాలా మంది బాలబాలికలు తప్పని తెలిసినా క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని.. చివరకు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు బాలికలు.. మాయమాటలు నమ్మి చివరకు దారుణంగా మోసపోతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో...

Crime news: గంటల వ్యవధిలో ఇద్దరు కూతుళ్లకు కడుపు నొప్పి.. కంగారుగా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చివరకు వారు చెప్పింది ఏంటంటే..
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం చాలా మంది బాలబాలికలు తప్పని తెలిసినా క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని.. చివరకు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు బాలికలు.. మాయమాటలు నమ్మి చివరకు దారుణంగా మోసపోతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇటీవల రాజస్థాన్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. గంటల వ్యవధిలో ఇద్దరు కూతుళ్లకు కడుపు నొప్పి వచ్చింది. దీంతో కంగారుగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చివరకు ఏం జరిగిందంటే..

రాజస్థాన్ (Rajasthan) అల్వార్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి భార్య, 13, 15ఏళ్ల కుమార్తెలు ఉన్నారు. ఇతను ఇంటికి సమీపంలోనే ఉన్న ఇటుకల బట్టీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. పాఠశాల సెలవు రోజుల్లో అతడి కూతుళ్లు కూడా బట్టీలో తండ్రికి చేదోడువాడోడుగా పని చేస్తూ ఉండేవారు. ఇదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు కూడా అక్కడే పని చేస్తుండేవారు. ఈ క్రమంలో బాలికలకు (girls) వారితో పరిచయం ఏర్పడింది. తర్వాత అప్పుడప్పుడూ వారు బాలిక ఇంటికి కూడా వెళ్తుండేవారు.

Viral: రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు.. జనాలను ఏమార్చేందుకు నయా ప్లాన్.. ఫోన్‌ చేసి ఇలా మాట్లాడితే అస్సలు నమ్మొద్దు..!

ఇలా కొన్నాళ్లకు వారి మధ్య ప్రేమ మొదలైంది. తండ్రి లేని సమయంలో బాలికలు వారితో కలుస్తూ ఉండేవారు. ఈ క్రమంలో ఇటీవల 15ఏళ్ల బాలికకు కడుపు నొప్పి వచ్చింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆమె ఏడున్నర నెలల గర్భంతో (pregnant) ఉన్నట్లు తెలిపారు. ఈ వార్త విన్న తల్లిదండ్రులు షాక్ అయ్యారు. కొన్ని గంటల్లో చిన్న కూతురు కూడా ఇదే సమస్యతో ఆస్పత్రి రాగా... ఆమె కూడా రెండున్నర నెలల గర్భిణి అని తెలిసింది. చివరకు తల్లిదండ్రులు వారిని గట్టిగా నిలదీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

Money: పేపర్ ముక్కలు కాదండోయ్.. కరెన్సీ నోట్లే.. ఓ వృద్ధురాలు కష్టపడి రూ.5.40 లక్షలను దాచుకుంటే..!

Updated Date - 2023-08-02T21:54:04+05:30 IST