Viral: బాబోయ్.. రెస్టారెంట్‌కు వెళ్లాక కూడా కాస్త చూసుకుని తినండయ్యా. చికెన్ కర్రీ ఆర్డర్ ఇస్తే అందులో ఏమొచ్చిందో చూస్తే..!
ABN , First Publish Date - 2023-08-16T15:11:32+05:30 IST
ప్రస్తుతం ఎక్కువ శాతం యువత ఫాస్ట్ ఫుడ్‌కి అలవాటు పడ్డారు. వంట చేసుకోవడానికి బద్ధకించి కొందరు అర్ధరాత్రి సమయాల్లోనూ ఆన్‌లైన్‌లో ఎడాపెడా ఆర్డర్లు పెట్టేస్తుంటారు. మరికొందరు పెద్ద పెద్ద హోటళ్లు, డాబాలకు వెళ్లి నచ్చిన ఫుడ్‌ను లొట్టలేసుకుని మరీ తింటుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో...
ప్రస్తుతం ఎక్కువ శాతం యువత ఫాస్ట్ ఫుడ్‌కి అలవాటు పడ్డారు. వంట చేసుకోవడానికి బద్ధకించి కొందరు అర్ధరాత్రి సమయాల్లోనూ ఆన్‌లైన్‌లో ఎడాపెడా ఆర్డర్లు పెట్టేస్తుంటారు. మరికొందరు పెద్ద పెద్ద హోటళ్లు, డాబాలకు వెళ్లి నచ్చిన ఫుడ్‌ను లొట్టలేసుకుని మరీ తింటుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ముంబైలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు డాబాకు వెళ్లి చికెన్ కర్రీని ఆర్డర్ చేశారు. తింటున్న క్రమంలో మధ్యలో ఉన్నట్లుండి కూరను పరిశీలించి షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే...
ముంబైలోని (Mumbai) పాలి నాకా ప్రాంతంలోని ఓ దాబాలో ఈ ఘటన చోటు చేసుకుంది. గోరేగావ్ ప్రాంతానికి చెందిన అనురాగ్ సింగ్ అనే అతను ఓ బ్యాంకులో పని చేస్తుంటాడు. ఇతడు ఆదివారం రాత్రి తన స్నేహితుడు అమీర్‌ఖాన్ అనే వ్యక్తితో కలిసి పాలి నాకా ప్రాంతానికి వెళ్లారు. అక్కడే ఉన్న దాబాలో డిన్నర్ చేసేందుకు వెళ్లారు. చికెన్ ఆర్డర్ (Chicken curry) చేయగా.. కాసేపటికి వెయిటర్ వారికి తీసుకొచ్చి వడ్డించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. చికెన్ తింటుండగా మధ్యలో వారికి ఊహించని షాక్ తగిలింది. చికెన్ ముక్కల మధ్యలో నుంచి చచ్చిపోయిన ఎలుక (Rat in chicken curry) బయటపడింది. దాన్ని చూడగానే వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వామ్మో! ఇంత సేపూ ఎలుక చచ్చిన కూర తిన్నామా.. అనుకుంటూ ప్లేటు పక్కన పెట్టి.. దాబా యాజమాన్యంతో గొడవ పెట్టుకున్నారు.
ఈ గొడవను సర్దుమణచాలని హోటల్ మేనేజర్ ప్రయత్నించినా... అనురాగ్ సింగ్ వినిపించుకోకుండా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. వారు తిన్న ఫుడ్‍ని పరీక్షల నిమిత్తం పంపారు. చివరకు పోలీసులు సోమవారం హోటల్ మేనేజర్‌తో పాటూ ఇద్దరు వంటవారిని కూడా అరెస్ట్ చేశారు. మంగళవారం వారు బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే దీనిపై హోటల్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. తమ హోటల్ ప్రతిష్టను మసకబార్చేందుకే వారిద్దరూ కలిసి ఇలా చేశారని ఆరోపించారు. 20 సంవత్సరాలుగా తమ హోటల్‌పై ఎలాంటి ఫిర్యాదులూ లేవన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆరోపించిన వారిద్దరూ అప్పటికే ఫుల్‌గా తాగి ఉన్నారని, హోటల్లో తాగడానికి అనుమతి ఇవ్వకపోవడంతో తమపై కక్షతో ఇలా చేశారని న్యాయవాది పేర్కొన్నారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.