Share News

Viral Video: భార్య ప్రవర్తనకు అవాక్కయిన భర్త.. కారు డ్రైవర్‌పై రెచ్చిపోయిన మహిళ.. అంతా చూస్తుండగానే..

ABN , First Publish Date - 2023-10-15T18:56:41+05:30 IST

పల్లెల్లో కొళాయిల వద్ద నీటి కోసం, ఇళ్ల మధ్య చెత్తాచెదారం వంటి చిన్న చిన్న సమస్యలపై మహిళలు కొట్టుకోవడం చూస్తూనే ఉంటాం. కొందరు మహిళలైతే.. మగాళ్లతో పోటీపడి మరీ జుట్లు పట్టుకుని మరీ కొట్టుకుంటుంటారు. అలాగే మరికొందరు మహిళలు..

Viral Video: భార్య ప్రవర్తనకు అవాక్కయిన భర్త.. కారు డ్రైవర్‌పై రెచ్చిపోయిన మహిళ.. అంతా చూస్తుండగానే..

పల్లెల్లో కొళాయిల వద్ద నీటి కోసం, ఇళ్ల మధ్య చెత్తాచెదారం వంటి చిన్న చిన్న సమస్యలపై మహిళలు కొట్టుకోవడం చూస్తూనే ఉంటాం. కొందరు మహిళలైతే.. మగాళ్లతో పోటీపడి మరీ జుట్లు పట్టుకుని మరీ కొట్టుకుంటుంటారు. అలాగే మరికొందరు మహిళలు.. మగవారిని సైతం లెక్కచేయకుండా ఎదురుతిరుగుతంటారు. తమ తప్పు ఉన్నా, లేకున్నా.. తమదే పైచేయి అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి మహిళలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో చాలా చూసుంటాం. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. కారు డ్రైవర్ ముందు రెచ్చిపోయిన మహిళలను చూసి భర్తతో పాటూ చుట్టు పక్కల వారు కూడా షాక్ అయ్యారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ చక్కర్లు కొడుతోంది. భార్యాభర్తలు (husband and wife) కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటారు. అదే సమయంలో ఓ యువకుడు కారులో వచ్చి అక్కడే నిలిపేస్తాడు. అయితే ఈ సమయంలో ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. కారు డ్రైవర్‌కు (Car driver) సదరు దంపతులకు మధ్య గొడవ (quarrel) మొదలవుతుంది. నీదే తప్పంటే.. కాదు నీ తప్పు.. అంటూ కారు డ్రైవర్‌తో భర్త వాగ్వాదం మొదలెడతారు. ఇది కాస్త కాసేపటికి మరింత ముదురుతుంది. ఈ క్రమంలో కారు డ్రైవర్ కొంచెం ఆవేశంగా మాట్లాడతాడు. భర్తపై కోపం ప్రదర్శించేసరికి భార్యకు ఎక్కడలేని ఆవేశం వస్తుంది. ‘‘కాసేపు నువ్వు పక్కనుండు.. నేను మాట్లాడతా’’.. అన్నట్లుగా కారు డ్రైవర్‌తో గొడవ పడుతుంది.

Viral Video: ఈ తల్లి ఏనుగు మనుషులకు ఏమాత్రం తీసిపోదు.. పిల్ల ఏనుగును నీటిలోకి తోయడంతో చివరకు ఏం జరిగిందో చూడండి..

ఈ క్రమంలో ఆమె కోపం కట్టలు తెంచుకుంటుంది. ముందూ వెనుకూ చూడకుండా అతడిపై చేయి చేసుకుంటుంది. చెంపపై ఫెడేల్‌మని గట్టిగా కొట్టడంతో కారు డ్రైవర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ సమయంలో ఆమె భర్త కూడా ఏమీ చెప్పలేక అలా చూస్తుండిపోతాడు. పక్కన ఉన్న వాహనదారులతో పాటూ పాదచారులు కూడా మహిళ రియాక్షన్ చూసి ఖంగుతింటారు. ఈ ఘటనను మొత్తం అక్కడే మరో వాహనంలో ఉన్న వ్యక్తి రికార్డు చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు కారు డ్రైవర్‌కు మద్దతుగా నిలుస్తుంటే.. మరికొందరు మహిళ చేసింది కరెక్ట్ అంటూ వాదిస్తున్నారు. ‘‘మహిళ చేయి చేసుకున్నా.. కారు డ్రైవర్ తిరిగి దాడి చేయకపోవడం అతడి సంస్కారాన్ని తెలియజేస్తోంది’’... అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: మొదటిసారి ఎస్కలేటర్ ఎక్కిన మహిళలు.. మధ్యలోకి వెళ్లగానే.. ఒక్కసారిగా ఏమైందో చూడండి..

Updated Date - 2023-10-15T18:56:41+05:30 IST