లవ్ సింబల్ ఆకారంలో ఉన్న చిప్స్ తిన్న మహిళ.. కాసేపటికి కోటి రూపాయలు మిస్ అయ్యావని స్నేహితులు చెప్పడంతో షాక్..

ABN , First Publish Date - 2023-02-25T21:20:35+05:30 IST

అదృష్టం తలుపు తట్టినప్పుడు వెంటనే తీయాలంటారు పెద్దలు. అయితే తలుపు తడుతున్నది అదృష్టమే అని ఎవరికి తెలుస్తుంది పాపం. అప్పుడప్పుడూ తెలిసో, తెలియకో.. కొందరు ఆఖరి నిముషంలో లక్కీ ఛాన్స్‌లను మిస్ అవుతూ ఉంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఇటీవల..

లవ్ సింబల్ ఆకారంలో ఉన్న చిప్స్ తిన్న మహిళ.. కాసేపటికి కోటి రూపాయలు మిస్ అయ్యావని స్నేహితులు చెప్పడంతో షాక్..

అదృష్టం తలుపు తట్టినప్పుడు వెంటనే తీయాలంటారు పెద్దలు. అయితే తలుపు తడుతున్నది అదృష్టమే అని ఎవరికి తెలుస్తుంది పాపం. అప్పుడప్పుడూ తెలిసో, తెలియకో.. కొందరు ఆఖరి నిముషంలో లక్కీ ఛాన్స్‌లను మిస్ అవుతూ ఉంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఇటీవల ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. చిప్స్ ప్యాకెట్‌ను ఓపెన్ చేసిన మహిళ.. అందులోని లవ్ సింబల్ ఆకారంలో ఉన్న ముక్కను కరకరా నమిలేసింది. కాసేపటికి కోటి రూపాయలు మిస్ అయ్యావని స్నేహితులు చెప్పడంతో షాక్ అయింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

యూకేలోని (UK) ష్రోప్ షైర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల డాన్ సాగేర్ అనే మహిళ (40 year old woman).. ఓ సూపర్ మార్కెట్‌లో పని చేస్తుంటుంది. ఆమెకు డ్యూటీలో ఉన్నప్పుడు సాల్టెడ్ చిప్స్ (Salted chips) తినే అలవాటు ఉంది. ఇటీవల ఆమె డ్యూటీకి వెళ్లగానే ఓ వాకర్స్ అనే సంస్థకు చెందిన చిప్స్ ప్యాకెట్ తీసుకుని ఓపెన్ చేసింది. అందులో ఓ ముక్క లవ్ సింబల్ (Love symbol) ఆకారంలో ఉంది. దీన్ని చూడగానే అరే!.. ఇది భలేగా ఉందే అని అనుకుంది. తినే ముందు దాన్ని ఫొటో కూడా తీసుకుంది. తర్వాత దాన్ని కరకరా నమిలేసి, చివరగా ఆ ఫొటోను తన స్నేహితులకు పంపించింది. తర్వాత యథావిధిగా పనిలో మునిగిపోయింది. అయితే కాసేపటికి తన స్నేహితుల నుంచి ఓ మెసేజ్ (message) వచ్చింది. ‘‘ అనవరసరంగా కోటి రూపాయలు మిస్ అయ్యావు’’ అని చెప్పడంతో ఒక్కసారిగా సదరు మహిళ షాక్ అయింది.

పెళ్లి తర్వాత ఇలాగే జరగాలంటూ వధువు వింత కోరిక.. వరుడి తండ్రి కూడా ఒప్పుకోవడంతో.. చివరకు అంతా కలిసి..

ఇదేంటీ లవ్ సింబల్ చిప్స్.. కోటి రూపాయలు (One crore rupees Offer) ఏంటీ అని అడిగింది. సదరు చిప్స్ కంపెనీ వారు.. లవ్ సింబల్ ఆకారంలో ఉన్న చిప్స్‌ను తీసుకొస్తే.. రూ.99లక్షలకు పైగా ఇస్తామని ప్రకటించారట. చివరకు ఈ వార్త విన్న మహిళ.. అయ్యో! ఎంత తప్పు చేశానంటూ విచారం వ్యక్తం చేసింది. అయితే, ఈ ఘటనతో మహిళ పని చేస్తున్న సూపర్ మార్కెట్ వాళ్లకు ఓ ఐడియా వచ్చింది. మా షాపులో ఇలాంటి ప్యాకెట్లు చాలా ఉన్నాయి, అందులో ఇలాంటి చిప్స్ కూడా చాలా ఉంటాయని చెప్పారు. దీంతో జనం సూపర్ మార్కెట్‌కు తండోప తండాలుగా తరలి వస్తున్నారు. కోటి రూపాయల ఆఫర్ మాట దేవుడెరుగు కానీ, సూపర్ మార్కెట్ వాళ్లకు మాత్రం.. ఈ ఐడియాతో కాసుల వర్షం కురుస్తోంది. కాగా, చిప్స్ సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ (Viral photos) అవడంతో నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

OYO Rooms: అమ్మ బాబోయ్.. ఓయో రూమ్స్‌ను ఇలాంటి పనులకు కూడా వాడుతున్నారా..? పోలీసుల రైడింగ్‌తో వెలుగులోకి విస్తుపోయే నిజాలు..!

Updated Date - 2023-02-25T21:26:04+05:30 IST