Crime News: అంతా బాగుండి ఉంటే మే 12న ఈ కుర్రాడి పెళ్లి జరిగేది.. కానీ ఊరి చివర ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు.. అతడి పక్కనే..!

ABN , First Publish Date - 2023-05-05T21:45:18+05:30 IST

ఇరవై ఏళ్ల ఓ యువకుడు చేతి వృత్తుల కళాకారుడిగా పని చేసేవాడు. వయసులో చిన్నవాడైనా కుటుంబ బాధ్యతలన్నీ తన భుజాన వేసుకుని నడిపించేవాడు. ఇంత కష్టపడే ఈ యువకుడి జీవితం.. అనూహ్య మలుపులు తీసుకుంది. ఇటీవలే..

 Crime News: అంతా బాగుండి ఉంటే మే 12న ఈ కుర్రాడి పెళ్లి జరిగేది.. కానీ ఊరి చివర ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు.. అతడి పక్కనే..!

ఇరవై ఏళ్ల ఓ యువకుడు చేతి వృత్తుల కళాకారుడిగా పని చేసేవాడు. వయసులో చిన్నవాడైనా కుటుంబ బాధ్యతలన్నీ తన భుజాన వేసుకుని నడిపించేవాడు. ఇంత కష్టపడే ఈ యువకుడి జీవితం.. అనూహ్య మలుపులు తీసుకుంది. ఇటీవలే ఇతడికి కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధం చూశారు. పెళ్లి తేదీ దగ్గర పడడంతో అంతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ ఆనందకర సమయంలో యువకుడు.. ఉన్నట్టుండి ఊరి చివర చెట్టుకు ఊరేసుకున్నాడు. చివరకు అసలు విషయం తెలుసుకుని.. అయ్యో! ఎంత ఘోరం జరిగిందంటూ అంతా కన్నీటిపర్యంతమయ్యారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాజ్‌గఢ్ జిల్లా భోజ్‌పూర్ పరిధి సెమ్లికలన్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన భన్వర్ లాల్ భిల్, నందు బాయి దంపతులకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. వీరి కుమారుల్లో చిన్న కొడుకైన బిరామ్ (20).. చేతి వృత్తుల కళాకారుడిగా పని చేసేవాడు. అందరి కంటే చిన్నవాడైనా.. కష్టపడి డబ్బు సంపాదిస్తూ కుటుంబ బాధ్యతలన్నీ తానే చూసుకునేవాడు. ఇలా ఆనందంగా సాగుతున్న వీరి కుటుంబంలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. బిరామ్ ఇటీవల రోజు వారి పనుల్లో భాగంగా సమీప గ్రామానికి వెళ్లాడు. అక్కడ ఓ ఇంట్లో పని చేస్తున్న పని క్రమంలో 17ఏళ్ల బాలికతో పరిచయమైంది.

20 ఏళ్ల తర్వాత అందిన సంతానం.. ఆ భార్యాభర్తలిద్దరి సంతోషం మూడు నెలల్లోనే ఆవిరి.. ఒకే ఒక్క ఘటనతో..

వీరి పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా (love with girl) మారింది. ఇధ్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. అయితే బిరామ్ కుటుంబ సభ్యులు.. అతడికి వేరే సంబంధం ఖాయం చేశారు. మే 12న వివాహం (marriage) జరగాల్సి ఉండడంతో అంతా పెళ్లి పనుల్లో తలమునకలై ఉన్నారు. ఈ వివాహం నచ్చని బిరామ్.. మానసికంగా తీవ్రంగా కుంగిపోయాడు. అయినా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకుండా సైలెంట్‌గా ఉన్నాడు. బుధవారం రాత్రి బంధువులతో ఇల్లు సందడి సందడిగా ఉంది. ఆ సమయంలో అర్జంట్ పనుందంటూ బిరామ్ బయటికి వెళ్లాడు.

Viral Video: నువ్వు కదయ్యా.. అసలు సిసలు తండ్రివంటే.. కూతురి సంతోషం కోసం అమ్మాయిలాగా వేషం వేసుకుని మరీ..!

వెళ్లిన వాడు రాత్రంతా ఇంటికి రాలేదు. ఉదయం కూడా రాకపోవడంతో చుట్టు పక్కల విచారించారు. చివరకు గ్రామ సమీపంలో ఓ చెట్టకు ఉరి వేసుకుని కనిపించాడు. పక్కనే అతడి ప్రియురాలు కూడా ఉరికి వేలాడుతూ ఉంది. ఇద్దరూ యువతికి చెందిన చున్నీతో (lovers suicide) ఉరేసుకున్నట్లు గుర్తించారు. స్థానికుల సమాచారంతో అక్కడికి వెళ్లిన మృతుల కుటుంబ సభ్యులు బోరున విలపించారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. తన తమ్ముని యువతి కుటుంబ సభ్యులే హత్య చేశారని మృతుడి సోదరుడు ఆరోపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Indian Railway: రైలు ఎక్కి సీట్లో కూర్చున్న మరుక్షణమే ఉలిక్కిపడ్డ కుర్రాడు.. దిగ్గున లేచి సీట్లో ఏముందో చూసి షాక్.. చివరకు..!

Updated Date - 2023-05-05T21:45:18+05:30 IST