Share News

Viral Video: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయయ్యా సామీ.. రోడ్డు మీద వెళ్లే ప్రతీ ఒక్కరూ సడన్‌గా చూసి షాకైపోతున్నారుగా..!

ABN , First Publish Date - 2023-10-25T20:53:59+05:30 IST

కాదేదీ సోషల్ మీడియాకు అనర్హం.. అన్నట్లుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ తమలోని ప్రతిభను బయటపెడుతూ అటు డబ్బులతో పాటూ ఇటు పేరుప్రఖ్యాతలు సంపాదిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు వీడియోల పేరుతో...

Viral Video: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయయ్యా సామీ.. రోడ్డు మీద వెళ్లే ప్రతీ ఒక్కరూ సడన్‌గా చూసి షాకైపోతున్నారుగా..!

కాదేదీ సోషల్ మీడియాకు అనర్హం.. అన్నట్లుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ తమలోని ప్రతిభను బయటపెడుతూ అటు డబ్బులతో పాటూ ఇటు పేరుప్రఖ్యాతలు సంపాదిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు వీడియోల పేరుతో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి నిర్వాకానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోడ్డు మీదకు వచ్చిన అతన్ని చూసి.. ‘‘ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయయ్యా సామీ’’... అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral video) అవుతోంది. రీల్ వీడియోల కోసం యువతీయువకులు (Young men and women) ఎలాంటి సాహసాలు చేయడానికైనా వెనుకాడడం లేదు. అయితే ఈ క్రమంలో కొందరు చేసే విచిత్రమైన పనులు చూస్తే కొన్నిసార్లు కోపం వస్తే.. మరికొన్నిసార్లు తెగ నవ్వు వస్తుంటుంది. తాజాగా, ఓ వ్యక్తి చేసిన పని చూసి అంతా నవ్వుకుంటున్నారు. ఓ యువకుడు విచిత్రంగా (man riding on buffalo) గేదెపై ఎక్కి రోడ్డు పైకి వచ్చాడు. అదికూడా తలకు హెల్మెట్ (Helmet) పెట్టుకుని వచ్చేశాడు. వాహనాల మధ్యలో గేదెపై వచ్చిన అతన్ని అంతా విచిత్రంగా చూశారు.

Viral News: పోలీసుల వద్దకు ఏడుస్తూ వచ్చిన 7 ఏళ్ల పిల్లాడు.. ఏమైందని అడిగితే ఆ బాలుడు చెప్పింది విని షాక్.. చివరకు ఊహించని ట్విస్ట్..!

గుర్రపు స్వారీ చేస్తున్నట్లుగా ఫీలవుతూ అతడు స్వారీ చేయడాన్ని చూసి వాహనదారులతో పాటూ పక్కన ఉన్న వారంతా నవ్వుకున్నారు. కొందరైతే అతన్ని ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. కొందరు యువకులు నవ్వుకుంటూనే అతన్ని అనుసరిస్తూ వెళ్లారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఎలా వస్తాయయ్యా... ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘హెల్మెట్ ఒకే.. మరి సీట్ బెల్ట్ విషయం ఏంటీ’’.. అని మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral: ఈ ఊరిని అమ్మేస్తున్నారట.. కళ్లు చెదిరే ధర ఉంటుందనుకుంటే పొరపాటే.. ఈ గ్రామం మొత్తాన్ని ఎంతకు కొనుక్కోవచ్చంటే..!

Updated Date - 2023-10-25T20:53:59+05:30 IST