Share News

Viral Video: ఇంట్లో దొరికే వస్తువులతోనే అద్భుత వంటకం.. నెటిజన్లను ఆకర్షిస్తున్న ‘‘జిమ్ వాలే మోమోస్’’..

ABN , First Publish Date - 2023-10-24T21:17:16+05:30 IST

ప్రస్తుత పాస్ట్‌ఫుడ్ ప్రపంచంలో యువత ఎక్కువగా శాండ్‌విచ్, బర్గర్లు తదితరాలకు అలవాటు పడుతున్నారు. మరోవైపు ఫిట్‌నెస్ విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది ఇప్పుడిప్పుడే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం..

Viral Video: ఇంట్లో దొరికే వస్తువులతోనే అద్భుత వంటకం.. నెటిజన్లను ఆకర్షిస్తున్న ‘‘జిమ్ వాలే మోమోస్’’..

ప్రస్తుత పాస్ట్‌ఫుడ్ ప్రపంచంలో యువత ఎక్కువగా శాండ్‌విచ్, బర్గర్లు తదితరాలకు అలవాటు పడుతున్నారు. మరోవైపు ఫిట్‌నెస్ విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది ఇప్పుడిప్పుడే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో వివిధ రకాల వంటకాలను ట్రై చేస్తుంటారు. ప్రస్తుతం ‘‘జిమ్ వాలే మోమోస్’’ పేరుతో వైరల్ అవుతున్న వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ‘‘జిమ్ వాలే మోమోస్’’ (gym wale momos)పేరుతో వినూత్న వంటకాన్ని సిద్ధం చేశాడు. ముందుగా అతను ఓ క్యాబేజీని (cabbage) తీసుకుని నీళ్లలో నానబెట్టాడు. తర్వాత పుట్టగొడుగులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని (Mushrooms, onions, green peppers) చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాడు. అలాగే పనీర్‌ను (Paneer) కూడా చాలా చిన్న ముక్కలుగా తురిమి చివరగా అన్నింటినీ మిక్స్ చేశాడు. దానిపై మసలా పౌడర్, బ్లాక్ సాల్ట్‌ను చల్లాడు.

Lover's video: ఇదెక్కడి ప్రేమరా బాబోయ్..! ప్రియురాలి నోట్లో పాలు పోసి మరీ.. ఇతడు చేసిన పని చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ఆ తర్వాత పక్కన పెట్టిన క్యాబేజీ నుంచి ఆకులను పక్కకు తీసుకుని, అందులో మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని క్యాబేజీ ఆకుల్లో చుట్టుకున్నాడు. పెనంలో నెయ్యి వేసి వేడి చేసిన తర్వాత అందులో క్యాబేజీ ముద్దలను ఉంచి వేడి చేస్తాడు. ఇలా ఫైనల్‌గా జిమ్ వాలే మోమోస్‌ని సిద్ధం చేస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఆహా..!.. చూస్తుంటేనే నోరూరుతోంది’’.. అంటూ కొందరు, ‘‘ప్రతి వారాంతంలో ఇలాంటి వంట ట్రై చేస్తాం’’.. అంటూ మరికొందరు, ‘‘ఇది ఆరోగ్యానికీ మంచిదే’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 98వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పెద్ద జంతువును మింగి ప్రాణం మీదకు తెచ్చుకున్న కొండచిలువ.. కంచె దాటుతుండగా ఉన్నట్టుండి ఏం జరిగిందంటే..

Updated Date - 2023-10-24T21:24:36+05:30 IST