Asia Cup 2023: ఇదెక్కడి క్రికెట్ ట్రైనింగ్‌రా బాబు.. ఏకంగా భగ భగ మండుతున్న నిప్పులపై నడుస్తున్నాడు.. వీడియో ఇదిగో!

ABN , First Publish Date - 2023-08-19T17:11:37+05:30 IST

చూస్తుండగానే ఆసియాకప్ 2023 టోర్నీ(Asia Cup 2023) దగ్గరకు వచ్చేసింది. ఇందుకోసం జట్లన్నీ ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాయి. ఈ ప్రాక్టీస్‌లో భాగంగానే బంగ్లాదేశ్ యువ ఆటగాడు మహ్మద్ నయిమ్(Bangladesh cricketer Mohammad Naim) ఏకంగా నిప్పులపై నడవడం ఆసక్తికరంగా మారింది.

Asia Cup 2023: ఇదెక్కడి క్రికెట్ ట్రైనింగ్‌రా బాబు.. ఏకంగా భగ భగ మండుతున్న నిప్పులపై నడుస్తున్నాడు.. వీడియో ఇదిగో!

చూస్తుండగానే ఆసియాకప్ 2023 టోర్నీ(Asia Cup 2023) దగ్గరకు వచ్చేసింది. ఇందుకోసం జట్లన్నీ ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాయి. ఈ ప్రాక్టీస్‌లో భాగంగానే బంగ్లాదేశ్ యువ ఆటగాడు మహ్మద్ నయిమ్(Bangladesh cricketer Mohammad Naim) ఏకంగా నిప్పులపై నడవడం ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. నెట్టింట ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు నయీమ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు నయీమ్ ఈ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. సబిత్ రేహాన్(Sabit Rayhan) అనే ట్రైనర్ సాయంతో ఈ ఫీట్ సాధించాడు.


అయితే క్రీడాకారులు ఇలా నిప్పులపై నడవడం ఇది కొత్తేం కాదు. గతంలో కూడా పలువురు ఆటగాళ్లు ఈ ఫైర్ వాకింగ్‌ చేశారు. ధైర్యాన్ని పెంచుకోవడంతోపాటు మానసికంగా దృఢంగా ఉండేందుకు ఈ ఫైర్ వాకింగ్ ఉపయోగపడుతుందని నిప్పులు చెబుతున్నారు. ఇక 23 ఏళ్ల మహ్మద్ నయీమ్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో పెదగా అనుభవం లేదు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన నయీమ్ ఇప్పటివరకు ఒక టెస్టు, 4 వన్డేలు మాత్రమే ఆడాడు. అత్యధిక స్కోర్ 24 పరుగులే. వన్డేల్లో అయితే ఒక సారి కూడా రెండెంకెల స్కోర్ సాధించలేదు. దీంతో ఆసియా కప్‌లో ఎలాగైనా రాణించాలని నయీమ్ పట్టుదలగా ఉన్నాడు. ఇక ఈ నెల 31 నుంచి ఆసియా కప్ ప్రారంభంకానుండగా.. బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో తలపడనుంది.

బంగ్లాదేశ్ ఆసియా కప్ స్క్వాడ్:

షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ దాస్, తాంజిద్ తమీమ్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, హసన్ మహ్మద్, నసుమ్ అహ్మద్, షైక్ మహ్మద్, షమీస్ అహ్మద్ , షోరిఫుల్ ఇస్లాం, ఎబాడోత్ హుస్సేన్, మహ్మద్ నయీమ్

Updated Date - 2023-08-19T17:11:37+05:30 IST