Share News

Ind vs Aus World Cup 2023 Final Live Updates: భారత్ చిత్తు.. విశ్వవిజేత ఆస్ట్రేలియా

ABN , First Publish Date - 2023-11-19T13:33:29+05:30 IST

అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైన‌ల్లో టీమిండియా టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లలో 240 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా గెలుపు దిశగా సాగుతోంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో అదరగొట్టాడు.

Ind vs Aus World Cup 2023 Final Live Updates: భారత్ చిత్తు.. విశ్వవిజేత ఆస్ట్రేలియా

Live News & Update

  • 2023-11-18T09:23:00+05:30

    విశ్వవిజేత ఆస్ట్రేలియా

    • ఫైనల్లో భారత్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా

    • భారత్‌పై 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం

    • స్కోర్లు: భారత్‌ 240 ఆలౌట్‌, ఆస్ట్రేలియా 241/3 (44 ఓవర్లు)

    • ఆసీస్ బ్యాటింగ్‌: ట్రావిస్‌ హెడ్‌ 140, లబుషేన్‌ 70 నాటౌట్‌

    • అన్నిరంగాల్లో రాణించి విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా

    • ఆరోసారి వన్డే వరల్డ్‌కప్ అందుకున్న కంగారూలు

    • వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో 2003 తర్వాత భారత్‌ మరోసారి బోల్తా

  • 2023-11-19T20:41:29+05:30

    ట్రావిస్ హెడ్ సెంచరీ

    95 బాల్స్‌లో ట్రావిస్ హెడ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో హెడ్‌కు ఇది రెండో సెంచరీ

  • 2023-11-19T20:28:21+05:30

    ముగిసిన 30వ ఓవర్

    30 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోరు 167/3గా ఉంది. క్రీజులో హెడ్ (86), లబుషేన్ (37) ఉన్నారు.

  • 2023-11-19T20:21:19+05:30

    ముగిసిన 28వ ఓవర్

    28 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోరు 163/3గా ఉంది. క్రీజులో హెడ్ (84), లబుషేన్ (35) ఉన్నారు.

  • 2023-11-19T20:10:47+05:30

    ముగిసిన 26వ ఓవర్

    26 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోరు 144/3గా ఉంది. క్రీజులో హెడ్ (69), లబుషేన్ (32) ఉన్నారు.

  • 2023-11-19T20:04:21+05:30

    ముగిసిన 24వ ఓవర్

    24 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోరు 127/3గా ఉంది. క్రీజులో హెడ్ (59), లబుషేన్ (25) ఉన్నారు.

  • 2023-11-19T19:56:14+05:30

    ముగిసిన 22వ ఓవర్

    22 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోరు 117/3గా ఉంది. క్రీజులో హెడ్ (51), లబుషేన్ (23) ఉన్నారు.

  • 2023-11-19T19:50:07+05:30

    ముగిసిన 20వ ఓవర్

    20 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోరు 104/3గా ఉంది. క్రీజులో హెడ్ (44), లబుషేన్ (17) ఉన్నారు.

  • 2023-11-19T19:40:52+05:30

    ముగిసిన 18వ ఓవర్

    18 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోరు 95/3గా ఉంది. క్రీజులో హెడ్ (41), లబుషేన్ (11) ఉన్నారు.

  • 2023-11-19T19:30:41+05:30

    ముగిసిన 16వ ఓవర్

    16 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోరు 87/3గా ఉంది. క్రీజులో హెడ్ (35), లబుషేన్ (9) ఉన్నారు.

  • 2023-11-19T19:25:48+05:30

    ముగిసిన 14వ ఓవర్

    14 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోరు 74/3గా ఉంది. క్రీజులో హెడ్ (25), లబుషేన్ (6) ఉన్నారు.

  • 2023-11-19T19:20:31+05:30

    ముగిసిన 12వ ఓవర్

    12 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోరు 68/3గా ఉంది. క్రీజులో హెడ్ (22), లబుషేన్ (3) ఉన్నారు.

  • 2023-11-19T19:11:59+05:30

    ముగిసిన 10వ ఓవర్

    10 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోరు 60/3గా ఉంది. క్రీజులో హెడ్ (19), లబుషేన్ (0) ఉన్నారు.

  • 2023-11-19T19:05:27+05:30

    8వ ఓవర్ మెయిడెన్ ఓవర్

    8వ ఓవర్‌ను షమీ మెయిడెన్ ఓవర్ వేశాడు. 8 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోరు 47/3గా ఉంది. క్రీజులో హెడ్ (10), లబుషేన్ (0) ఉన్నారు.

  • 2023-11-19T19:01:17+05:30

    మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    47 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో స్మిత్ (4) ఔట్

  • 2023-11-19T18:51:50+05:30

    ఐదో ఓవర్ మెయిడెన్ ఓవర్

    ఐదో ఓవర్‌ను బుమ్రా మెయిడెన్ ఓవర్ వేశాడు. ఐదు ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోరు 41/2గా ఉంది. క్రీజులో హెడ్ (8), స్మిత్ (0) ఉన్నారు.

  • 2023-11-19T18:48:47+05:30

    రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    41 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ (15) ఔట్

  • 2023-11-19T18:40:38+05:30

    ముగిసిన మూడో ఓవర్

    మూడు ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోరు 29/1గా ఉంది. క్రీజులో హెడ్ (8), మిచెల్ మార్ష్ (6) ఉన్నారు.

  • 2023-11-19T18:35:50+05:30

    ముగిసిన రెండో ఓవర్

    రెండు ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోరు 27/1గా ఉంది. క్రీజులో హెడ్ (8), మిచెల్ మార్ష్ (5) ఉన్నారు.

  • 2023-11-19T18:30:20+05:30

    తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    16 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో వార్నర్ (7) అవుట్

  • 2023-11-19T17:56:48+05:30

    ముగిసిన 50 ఓవర్లు

    50 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 240 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా ముందు 241 పరుగుల టార్గెట్ నిలిచింది.

  • 2023-11-19T17:50:14+05:30

    ముగిసిన 49వ ఓవర్

    49 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 232/9గా ఉంది. క్రీజులో సిరాజ్ (3), కుల్‌దీప్ (8) ఉన్నారు.

  • 2023-11-19T17:42:34+05:30

    సూర్యకుమార్ అవుట్

    226 పరుగుల వద్ద టీమిండియా 9వ వికెట్ కోల్పోయింది. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో సూర్యకుమార్ (18) అవుట్

  • 2023-11-19T17:34:14+05:30

    ముగిసిన 46వ ఓవర్

    46 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 221/8గా ఉంది. క్రీజులో సూర్యకుమార్ (15), కుల్‌దీప్ (5) ఉన్నారు.

  • 2023-11-19T17:28:12+05:30

    బుమ్రా అవుట్

    214 పరుగుల వద్ద టీమిండియా 8వ వికెట్ కోల్పోయింది. జంపా బౌలింగ్‌లో బుమ్రా (1) అవుట్

  • 2023-11-19T17:14:33+05:30

    ముగిసిన 42వ ఓవర్

    42 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 207/6గా ఉంది. క్రీజులో సూర్యకుమార్ (10), షమీ (4) ఉన్నారు.

  • 2023-11-19T17:11:00+05:30

    కేఎల్ రాహుల్ అవుట్

    203 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (66) అవుట్

  • 2023-11-19T17:05:35+05:30

    ప్రతి 10 ఓవర్లకు భారత్ చేసిన స్కోర్

    తొలి 10 ఓవర్లలో 80-2

    11-20 ఓవర్లలో 35-1

    21-30 ఓవర్లలో 37-1

    31-40 ఓవర్లలో 45-1

  • 2023-11-19T17:01:03+05:30

    ముగిసిన 40వ ఓవర్

    40 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 197/5గా ఉంది. క్రీజులో సూర్యకుమార్ (8), కేఎల్ రాహుల్ (64) ఉన్నారు.

  • 2023-11-19T16:58:53+05:30

    ముగిసిన 39వ ఓవర్

    39 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 192/5గా ఉంది. క్రీజులో సూర్యకుమార్ (6), కేఎల్ రాహుల్ (61) ఉన్నారు.

  • 2023-11-19T16:54:08+05:30

    ముగిసిన 38వ ఓవర్

    38 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 182/5గా ఉంది. క్రీజులో సూర్యకుమార్ (1), కేఎల్ రాహుల్ (58) ఉన్నారు.

  • 2023-11-19T16:45:36+05:30

    ముగిసిన 36వ ఓవర్

    36 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 178/5గా ఉంది. క్రీజులో సూర్యకుమార్ (0), కేఎల్ రాహుల్ (55) ఉన్నారు.

  • 2023-11-19T16:43:56+05:30

    రవీంద్ర జడేజా అవుట్

    178 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో జడేజా (9) అవుట్

  • 2023-11-19T16:37:15+05:30

    కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ

    86 బాల్స్‌లో కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో రాహుల్‌కు ఇది రెండో హాఫ్ సెంచరీ

    kl rahul.jpg

  • 2023-11-19T16:32:07+05:30

    ముగిసిన 34వ ఓవర్

    34 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 169/4గా ఉంది. క్రీజులో జడేజా (7), కేఎల్ రాహుల్ (48) ఉన్నారు.

  • 2023-11-19T16:21:52+05:30

    ముగిసిన 32వ ఓవర్

    32 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 162/4గా ఉంది. క్రీజులో జడేజా (5), కేఎల్ రాహుల్ (45) ఉన్నారు.

  • 2023-11-19T16:13:42+05:30

    ముగిసిన 30వ ఓవర్

    30 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 152/4గా ఉంది. క్రీజులో జడేజా (1), కేఎల్ రాహుల్ (39) ఉన్నారు.

  • 2023-11-19T16:05:36+05:30

    విరాట్ కోహ్లీ అవుట్

    148 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా.. కమిన్స్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ (54) అవుట్

  • 2023-11-19T16:01:09+05:30

    ముగిసిన 28వ ఓవర్

    28 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 146/3గా ఉంది. క్రీజులో విరాట్ కోహ్లీ (53), కేఎల్ రాహుల్ (36) ఉన్నారు.

  • 2023-11-19T15:58:05+05:30

    97 బాల్స్ తర్వాత బౌండరీ

    టీమిండియా 97 బాల్స్ తర్వాత 26వ ఓవర్‌లో రెండో బాల్‌కు బౌండరీ కొట్టింది. కేఎల్ రాహుల్ ఈ బౌండరీ సాధించాడు

  • 2023-11-19T15:56:11+05:30

    ముగిసిన 26వ ఓవర్

    26 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 135/3గా ఉంది. క్రీజులో విరాట్ కోహ్లీ (50), కేఎల్ రాహుల్ (28) ఉన్నారు.

  • 2023-11-19T15:54:31+05:30

    విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ

    55 బాల్స్‌లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డే కెరీర్‌లో కోహ్లీకి ఇది 72వ హాఫ్ సెంచరీ

  • 2023-11-19T15:50:37+05:30

    ముగిసిన 25వ ఓవర్

    25 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 131/3గా ఉంది. క్రీజులో విరాట్ కోహ్లీ (49), కేఎల్ రాహుల్ (25) ఉన్నారు.

  • 2023-11-19T15:48:32+05:30

    ముగిసిన 24వ ఓవర్

    24 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 128/3గా ఉంది. క్రీజులో విరాట్ కోహ్లీ (47), కేఎల్ రాహుల్ (24) ఉన్నారు.

  • 2023-11-19T15:45:17+05:30

    ముగిసిన 23వ ఓవర్

    23 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 125/3గా ఉంది. క్రీజులో విరాట్ కోహ్లీ (45), కేఎల్ రాహుల్ (23) ఉన్నారు.

  • 2023-11-19T15:39:33+05:30

    ముగిసిన 22వ ఓవర్

    22 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 121/3గా ఉంది. క్రీజులో విరాట్ కోహ్లీ (42), కేఎల్ రాహుల్ (22) ఉన్నారు.

  • 2023-11-19T15:36:50+05:30

    ముగిసిన 21వ ఓవర్

    21 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 119/3గా ఉంది. క్రీజులో విరాట్ కోహ్లీ (41), కేఎల్ రాహుల్ (21) ఉన్నారు.

  • 2023-11-19T15:31:44+05:30

    ముగిసిన 20వ ఓవర్

    20 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 115/3గా ఉంది. క్రీజులో విరాట్ కోహ్లీ (39), కేఎల్ రాహుల్ (19) ఉన్నారు.

  • 2023-11-19T15:28:14+05:30

    ముగిసిన 19వ ఓవర్

    19 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 113/3గా ఉంది. క్రీజులో విరాట్ కోహ్లీ (38), కేఎల్ రాహుల్ (18) ఉన్నారు.

  • 2023-11-19T15:24:27+05:30

    ముగిసిన 18వ ఓవర్

    18 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 107/3గా ఉంది. క్రీజులో విరాట్ కోహ్లీ (35), కేఎల్ రాహుల్ (15) ఉన్నారు.

  • 2023-11-19T15:20:35+05:30

    ముగిసిన 17వ ఓవర్

    17 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 104/3గా ఉంది. క్రీజులో విరాట్ కోహ్లీ (35), కేఎల్ రాహుల్ (12) ఉన్నారు.

  • 2023-11-19T15:10:17+05:30

    ముగిసిన 16వ ఓవర్

    16 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 101/3గా ఉంది. క్రీజులో విరాట్ కోహ్లీ (34), కేఎల్ రాహుల్ (10) ఉన్నారు.

  • 2023-11-18T15:07:00+05:30

    14 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 94/3గా ఉంది. క్రీజులో విరాట్ (31), కేఎల్ రాహుల్ (8) ఉన్నారు.

  • 2023-11-18T14:50:00+05:30

    టీమిండియాకి దెబ్బమీద దెబ్బపడింది. రోహిత్ ఔటవ్వడంతో క్రీజులో అడుగుపెట్టిన శ్రేయాస్ అయ్యర్ స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. కేవలం 3 బంతులు ఎదుర్కొన్న అయ్యర్ 4 పరుగులు కొట్టి పాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కీపర్ ఇంగ్లిస్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 11 ఓవర్లు ముగిసేసరికి ఇండియా స్కోరు 82/3గా ఉంది. క్రీజులో విరాట్, కేఎల్ రాహుల్ ఉన్నారు.

  • 2023-11-18T14:45:00+05:30

    రోహిత్ శర్మ ఔట్.. షాక్‌లో టీమిండియా ఫ్యాన్స్. దూకుడు ఆడే క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ (47) ఔటయ్యాడు. జట్టు స్కోరు 76 పరుగుల వద్ద ఔటయ్యాడు. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో హెడ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాగా హెడ్ అత్యంత కష్టమైన క్యాచ్‌ను పట్టాడు. 10 ఓవర్లు ముగిసే సమయానికి జట్లు స్కోరు 80/2గా ఉంది.

  • 2023-11-18T14:42:00+05:30

    9 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 66/1గా ఉంది. క్రీజులో కెప్టెన్ రోహిత్, కింగ్ విరాట్ కోహ్లీ ఉన్నారు. 27 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 37 పరుగులు కొట్టాడు. 20 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 23 పరుగులు కొట్టాడు.

  • 2023-11-18T14:34:00+05:30

    వికెట్ పడినా తగ్గేదేలే...

    టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లీ ఫైనల్ మ్యాచ్‌లోనూ అదే దూకుడు కొనసాగిస్తున్నారు. ఇద్దరూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. మిచెల్ స్టార్క్ వేసిన 7వ ఓవర్‌లో బౌండరీలతో స్టేడియాన్ని కోహ్లీ మోతెక్కించాడు. మొదటి 3 బంతులను వరుసగా బౌండరీకి తరలించాడు. కాగా 7 ఓవర్లు ముగిసేసరికి ఇండియా స్కోరు 54/1గా ఉంది. రోహిత్ శర్మ(33), విరాట్(16) క్రీజులో ఉన్నారు.

  • 2023-11-18T14:25:00+05:30

    5 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 37/1గా ఉంది. 20 బంతులు ఎదుర్కొన్న కెప్టెన్ రోహిత్ శర్మ 31 పరుగులు కొట్టాడు. ఇందులో 2 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నారు. విరాట్ కోహ్లీ ఇంకా ఖాతా తెరవలేదు.

  • 2023-11-18T14:22:00+05:30

    టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ వేసిన ఐదో ఓవర్‌లో ఓపెనర్ శుభ్‌మాన్ ఔటయ్యాడు. ఆడమ్ జంపాకు సులభమైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శుభ్‌మాన్ గిల్ ఔటవ్వడంతో కింగ్ విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు.

  • 2023-11-18T14:20:00+05:30

    ఫైనల్ మ్యాచ్‌లోనూ టీమిండియా అదే దూకుడు కొనసాగిస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. 4 ఓవర్లు ముగిసే సరికి 19 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో రోహిత్ విజృంభించాడు.

  • 2023-11-18T14:15:00+05:30

    3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 18/0 గా ఉంది. క్రీజులో కెప్టెన్ రోహిత్ (14), గిల్(3) ఉన్నారు.

  • 2023-11-18T14:11:00+05:30

    అదృష్టం కొద్దీ బతికిపోయిన శుభ్‌మాన్ గిల్. మూడో ఓవర్ మొదటి బంతికి ఔటయ్యే ప్రమాదం నుంచి ఓపెన్ శుభ్‌మాన్ గిల్ బయటపడ్డాడు. బంతి బ్యాట్ ఎడ్జికి తగిలి కీపర్, ఫస్ట్ స్లిప్పర్‌కి దగ్గరపడింది. కానీ క్యాచ్ పట్టలేకపోయారు.

  • 2023-11-18T14:09:00+05:30

    రెండో ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు పరుగులుగా ఉంది. క్రీజులో కెప్టెన్ రోహిత్ శర్మ(13), శుభ్‌మాన్ గిల్ ఉన్నారు. గిల్ ఇంతవరకు ఒక్క బంతి కూడా ఎదుర్కొలేదు.

  • 2023-11-18T14:07:00+05:30

    వరుస బౌండరీలు..

    రెండో ఓవర్ వరుసగా 2,3 బంతులను కెప్టెన్ రోహిత్ శర్మ బౌండరీలు కొట్టాడు.

  • 2023-11-18T14:04:00+05:30

    ఆస్ట్రేలియా స్టార్ పేసర్ స్టార్ వేసిన మొదటి ఓవర్‌లో 3 పరుగులు రాబట్టిన టీమిండియా. ఓపెనర్లుగా క్రీజులో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ(3), శుభ్‌మాన్ గిల్(0).

  • 2023-11-18T14:01:00+05:30

    మొదటి ఓవర్ రెండో బంతికి 2 పరుగులతో టీమిండియా పరుగుల ఖాతా తెరిచింది.

  • 2023-11-18T13:55:00+05:30

    ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకోవడానికి కారణం ఇదే..

    టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించింది. రాత్రి పూట మంచు పడే అవకాశం ఉండడంతోనే తొలుత బౌలింగ్ ఎంచుకున్నట్టు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ కారణాన్ని తెలిపాడు. అయితే రోహిత్ శర్మ మాట్లాడుతూ తాము బ్యాటింగే ఎంచుకునేవాళ్లమని తెలిపాడు. కాగా వికెట్ డ్రైగా ఉండడంతో స్పిన్సర్లకు అనుకూలించనుందని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

  • 2023-11-18T13:37:00+05:30

    ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగిన ఇండియా, ఆస్ట్రేలియా జట్లు.

    తుది జట్లు:

    ఇండియా: రోహిత్ శర్మ(c), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్,(w), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

    ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబూషేన్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, జాష్ ఇంగ్లిష్(వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్(c), ఆడమ్ జంపా, జాస్ హేజిల్‌వుడ్.

  • 2023-11-18T12:32:00+05:30

    టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. దీంతో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.

  • 2023-11-18T13:32:00+05:30

    చిరకాల ప్రత్యర్థిని చిత్తుచేసి.. చాంపియన్‌ను మట్టికరిపించి.. ఫేవరెట్లను తేలిగ్గా పడగొట్టి.. నాకౌట్‌లో గట్టి పంచ్‌ ఇచ్చి.. ఫైనల్‌ చేరిన టీమిండియాకు జగజ్జేతగా నిలిచేందుకు మరొక్క విజయమే..! 20 ఏళ్ల కిందటి పరాజయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు.. ప్రపంచ క్రికెట్‌లో మనమే మొనగాళ్లమని చాటేందుకు.. అజేయ రికార్డు అందుకునేందుకు ఒక్క గెలుపే దూరం..! ముచ్చటగా మూడో కప్‌ను.. పుష్కరకాలంగా దక్కని ట్రోఫీని.. పదేళ్ల తర్వాత ఓ ఐసీసీ టైటిల్‌ను.. ఒడిసిపట్టేందుకు ఇంకొక్క గెలుపే! ఆ సమయం రానే వచ్చింది.. మహా సమరానికి అంతా సిద్ధమైంది.

    ప్రపంచ కప్‌ను ముచ్చటగా మూడోసారి ముద్దాడాలని భారత్.. రికార్డు స్థాయిలో 6వసారి ఎగరేసుకుపోవాలని ఆస్ట్రేలియా.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మరికొద్ది సేపట్లో వన్డే వరల్డ్ కప్ 2023 ఆఖరి పోరాటం మొదలుకానుంది. టీమిండియా కప్ గెలవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ప్రార్థనలు చేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఫైనల్ ఫీవర్ కనిపిస్తోంది. ఎక్కడ చూసిన భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ గురించే మాట్లాడుకుంటున్నారు.