Share News

Rohit Sharma: వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన రోహిత్.. మొట్టమొదటి ఇండియన్‌గా రికార్డ్

ABN , First Publish Date - 2023-10-23T10:10:11+05:30 IST

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో (World cup2023) టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి టచ్‌లో ఉన్నాడు. అద్భుతమైన ఆరంభాలను అందిస్తూ ప్రత్యర్థులను భయపెడుతున్నాడు.

Rohit Sharma: వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన రోహిత్.. మొట్టమొదటి ఇండియన్‌గా రికార్డ్

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో (World cup2023) టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి టచ్‌లో ఉన్నాడు. అద్భుతమైన ఆరంభాలను అందిస్తూ ప్రత్యర్థులను భయపెడుతున్నాడు. ధర్మశాల వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లోనూ తన సత్తాను చాటాడు. 40 బంతుల్లో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇందులో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. శుభ్‌మాన్ గిల్‌తో కలిసి మొదటి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ అరుదైన రికార్డును నెలకొల్పాడు.

ఒక క్యాలెండర్ ఏడాదిలో 50 కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయంగా చూస్తే రోహిత్ కంటే ముందు సౌతాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివీలియర్స్, వెస్టిండీస్ గ్రేట్ క్రిస్ గేల్ మాత్రమే ఉన్నారు. గత రాత్రి న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లో హెన్రీ వేసిన రెండో ఓవర్‌లో కొట్టిన సిక్సర్‌తో రోహిత్ ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.


ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక సిక్సర్ల కొట్టిన హీరోలు వీళ్లే..

1. ఏబీ డివీలియర్స్ - 58 (2015).

2. క్రిస్ గేల్ - 56 (2019).

3. రోహిత్ శర్మ - 53 (2023).

ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్‌లో రోహిత్ మరో 5 సిక్సర్లు బాదితే ఈ జాబితాలో అగ్రస్థానానికి ఎగబాకుతాడు. కాగా న్యూజిలాండ్‌పై గెలుపు అనంతరం మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ మరోసారి జట్టుని గెలిపించారని కొనియాడాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు.

Updated Date - 2023-10-23T10:10:11+05:30 IST