World Cup: ప్రపంచకప్ ట్రోఫీకి దారుణ అవమానం.. ఆస్ట్రేలియా క్రికెటర్‌పై నెటిజన్స్ ఫైర్
ABN , First Publish Date - 2023-11-20T14:15:49+05:30 IST
Mitchell, Marsh: భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ గెలిచిన అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు విమర్శలకు దారి తీసింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్ ప్రపంచకప్ ట్రోఫిపై కాళ్లు పెట్టి మద్యపానం సేవిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ గెలిచిన అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు విమర్శలకు దారి తీసింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్ ప్రపంచకప్ ట్రోఫిపై కాళ్లు పెట్టి మద్యపానం సేవిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వరల్డ్ కప్ అనంతరం సంబరాలు చేసుకున్న ఫోటోలను ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడం ద్వారా ఇది బయటికి వచ్చింది. వైరల్‌గా మారిన ఫోటోల్లో కుర్చీపై కూర్చున్న మిచెల్ మార్ష్ ప్రపంచకప్ ట్రోఫీ తన రెండు కాళ్లను పెట్టాడు. అంతేకాకుండా మద్యం కూడా సేవిస్తున్నాడు. దీంతో మిచెల్ మార్ష్ తీరుపై అంతటా విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిచెల్ మార్ష్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఇంత అహంకారామా అని మండిపడుతున్నారు. ప్రపంచకప్ ట్రోఫీని గౌరవించుకోవడం నేర్చుకోవాలని సూచిస్తున్నారు.
ఈ క్రమంలో 1983లో టీమిండియా ప్రపంచకప్ గెలిచినప్పుడు కెప్టెన్ కపిల్ దేవ్ ట్రోఫిని తలపై పెట్టుకున్న ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. కపిల్ దేవ్‌ను చూసి నేర్చుకోవాలని మార్ష్‌కు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా 2006లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు గురించి కూడా నెటిజన్లు లెవనెత్తుతున్నారు. ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న శరద్ పవార్‌ను ఆస్ట్రేలియా ఆటగాళ్లు పక్కకు నెట్టిన సంఘటనను గుర్తు చేస్తున్నారు. ఎన్ని ట్రోఫీలు గెలిచినా ఆస్ట్రేలియా ఆటగాళ్ల ప్రవర్తనలో మార్పు రాదని మండిపడుతున్నారు. ప్రపంచకప్ గెలిస్తే సరిపోదని ట్రోఫిని కూడా గౌరవించాలని, లేదంటే ఆ విజయానికి గౌరవం ఉండదని నెటిజన్లు రాసుకొస్తున్నారు. ట్రోఫీ పట్ల ఇలా వ్యవహరించడం దారుణమని అంటున్నారు.
కాగా ఆదివారం జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియాపై గెలిచిన ఆస్ట్రేలియా ట్రోఫిని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఏకపక్షంగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్యాన్ని కంగారులు 4 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించారు. ఆ జట్టు ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో చెలరేగాడు. మిచెల్ మార్ష్ మాత్రం 15 పరుగులకే ఔట్ అయ్యాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.