Virat Kohli: కోహ్లీ ఇంకెన్నాళ్లు క్రికెట్ ఆడగలడో చెప్పిన రవిశాస్త్రి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ABN , First Publish Date - 2023-03-25T18:10:41+05:30 IST

ప్రపంచ క్రికెట్ లెజండ్ సచిన్ తెందుల్కర్ (Sachin tendulkar) నెలకొల్పిన 100 సెంచరీల మైలురాయిని (100 centuries) ప్రస్తుత తరం క్రికెటర్లలో ఎవరైనా అధిగమించగలడా? అంటే...

Virat Kohli: కోహ్లీ ఇంకెన్నాళ్లు క్రికెట్ ఆడగలడో చెప్పిన రవిశాస్త్రి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ముంబై: ప్రపంచ క్రికెట్ లెజండ్ సచిన్ తెందుల్కర్ (Sachin tendulkar) నెలకొల్పిన 100 సెంచరీల మైలురాయిని (100 centuries) ప్రస్తుత తరం క్రికెటర్లలో ఎవరైనా అధిగమించగలడా? అంటే ముందుగా గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ (Virat Kohli). దాదాపు మూడేళ్ల తర్వాత టెస్టు ఫార్మాట్‌పై ఆస్ట్రేలియాపై సెంచరీ చేయడంతో (IndiaVsAustralia) మరోసారి ఈ టాపిక్ తెరపైకి వచ్చింది. కోహ్లీ మునిపటి ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపిస్తుండడంతో సచిన్ తెందుల్కర్ (Sachin tendulkar) 100 శతకాల రికార్డును చేరుకోగల సామర్థ్యం అతడికి ఉందంటూ చాలామంది మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే విషయంపై మాజీ క్రికెటర్, మాజీ కోచ్ రవి శాస్త్రి (Ravi Shastri) కూడా తన అభిప్రాయాన్ని చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు సాధించడం కోహ్లీకి అంత సులభం కాదని వ్యాఖ్యానించాడు. ఒకవేళ ఈ మైలురాయిని చేరుకుంటే చాలా పెద్ద విషయం అవుతుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

‘‘ అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే 100 సెంచరీలు కొట్టాడనే విషయాన్ని ప్రతిఒక్కరూ దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి, ఇంకెవరో ఈ రికార్డును అధిగమిస్తారని చెప్పడం చాలా పెద్ద విషయం అవుతుంది. ఆడడానికి అతనిలో (కోహ్లీ) చాలా క్రికెట్ ఉంది. ఫిట్ ప్లేయర్, ఆడగలడు. త్వరత్వరగా సెంచరీలు బాదేశాడు. నా దృష్టిలో విరాట్ కోహ్లీ ఇంకా 5-6 సంవత్సరాలపాటు క్రికెట్ ఆడగలడు. అయితే 100 సెంచరీలను ఊహించకోవడం అంత సులభం కాదు. అందుకే ఇప్పటివరకు ఒక్కడు మాత్రమే సాధించాడు’’ అని స్పోర్ట్స్ యారీతో (Sports yaari) మాట్లాడుతూ రవి శాస్త్రి అన్నాడు.

కాగా 1205 రోజుల తర్వాత విరాట్ కోహ్ల టెస్టుల్లో ఇటివల ఆస్ట్రేలియాపై అహ్మదాబాద్ టెస్టులో సెంచరీ కొట్టాడు. టెస్ట్ ఫార్మాట్‌లో అతడికిది 28వ సెంచరీ కాగా.. అంతర్జాతీయ కెరీయర్‌లో 75వ సెంచరీ పూర్తి చేసినట్టయ్యింది. కాగా టెస్టుల్లో చివరి శతకం పూర్తి చేయడానికి కోహ్లీకి ఏకంగా 41 ఇన్నింగ్స్‌ పట్టింది. చివరిసారిగా నవంబర్ 2019లో బంగ్లాదేశ్‌పై టెస్టు సంచరీ నమోదు చేసిన విషయం తెలిసింది. కాగా మార్చి 31 నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్2023లో విరాట్ కోహ్లీ ఆడబోతున్నాడు.

Updated Date - 2023-03-25T18:13:27+05:30 IST