Share News

Venkatesh Iyer: ఓ ఇంటివాడు కాబోతున్న టీమిండియా స్టార్ క్రికెటర్.. పెళ్లి కూతురు ఎవరంటే..?

ABN , First Publish Date - 2023-11-21T13:48:13+05:30 IST

టీమిండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శ‌ృతి రఘునాథన్ అనే అమ్మాయిని అయ్యర్ వివాహం చేసుకోనున్నాడు. ఈ మేరకు మంగళవారం అయ్యర్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బంధుమిత్రులు హాజరయ్యారు.

Venkatesh Iyer: ఓ ఇంటివాడు కాబోతున్న టీమిండియా స్టార్ క్రికెటర్.. పెళ్లి కూతురు ఎవరంటే..?

టీమిండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శ‌ృతి రఘునాథన్ అనే అమ్మాయిని అయ్యర్ వివాహం చేసుకోనున్నాడు. ఈ మేరకు మంగళవారం అయ్యర్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బంధుమిత్రులు హాజరయ్యారు. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను వెంకటేష్ అయ్యర్ తన ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ అకౌంట్‌ల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘‘నా జీవితంలో తర్వాతి చాప్టర్ ప్రారంభం’’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో వెంకటేష్ అయ్యర్‌కు టీమిండియా క్రికెటర్లతోపాటు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే వివాహ వేడుక ఎప్పుడూ జరుగుతుందనే విషయాన్ని మాత్రం వెంకటేష్ అయ్యర్ కానీ, అతని కుటుంబసభ్యలు కానీ వెల్లడించలేదు. కాకపోతే త్వరలోనే వివాహం కూడా జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ అయ్యర్ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


28 ఏళ్ల వెంకటేష్ అయ్యర్‌కు ప్రస్తుతం భారత జట్టులో చోటు లేకపోయినప్పటికీ ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌లో వెంకటేష్ అయ్యర్ కీలక సభ్యుడిగా ఉన్నాడు. భారత జట్టు తరఫున ఇప్పటివరకు 2 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఇక తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 36 మ్యాచ్‌లాడాడు. 28 సగటుతో 956 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 7 హాఫ్ సెంచరీలున్నాయి.

Updated Date - 2023-11-21T14:07:30+05:30 IST