CM KCR: పాలిచ్చే బర్రెను విడిచి ఎవరైనా దున్నపోతును తెచ్చుకుంటారా?
ABN , First Publish Date - 2023-11-17T16:46:41+05:30 IST
Telangana Elections: ‘‘ఎన్నికలొచ్చాయంటే అడ్డగోలు జమాబందీలు జరుగుతుంటాయి.. మీరు ఇండ్లకు వెళ్లిన తరువాత రాయి ఏదో రత్నం ఏదో ఆలోచించుకోవాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
కరీంనగర్: ‘‘ఎన్నికలొచ్చాయంటే అడ్డగోలు జమాబందీలు జరుగుతుంటాయి..మీరు ఇండ్లకు వెళ్లిన తరువాత రాయి ఏదో రత్నం ఏదో ఆలోచించుకోవాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజురాబాద్‌లో ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ (BRS) పుట్టిందే తెలంగాణ రాష్ట్రం కోసమని.. కాంగ్రెస్, బీజేపీల చరిత్ర తెలుసుకోవాలన్నారు. మంచి పార్టీకి ఓటు వేస్తె మంచే జరుగుతుందన్నారు. తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ .. ఇది ఉద్యమాల గడ్డ అని తాను కూడా ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చానని తెలిపారు. మోటార్లకు మీటర్లు పెట్టకపోతే నిధుల్లో కోత పెడతాను అన్నా తాను పట్టించుకోలేదన్నారు. రైతు బంధు రూ.16 వేలు కావాలంటే ఇక్కడ కౌశిక్ రెడ్డి (BRS Candidate Koushik Reddy) గెలవాలని.. ఆయన గెలిస్తేనే అక్కడ ప్రభుత్వం వస్తుందన్నారు.
‘‘రాహుల్ గాంధీ (Rahul Gandhi), భట్టి విక్రమార్క (Bathi Vikramarka), రేవంత్ రెడ్డిలు (Revanth Reddy) ధరణిని బంగాళాఖాతంలో వేసి భూమాత పెడతారట. ధరణి పొతే మరి మీకు రైతుబంధు ఎలా వస్తుంది ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ బీజేపీ గెలిస్తే ఏమొస్తది.. ఇప్పుడు ఇక్కడ గెలిచి ఎన్నాళ్లు అయ్యింది.. ఒక్క పైసా పని చేసిండా. ఈటెల రాజేందర్ లేని రోజుల్లోనే కౌశిక్ రెడ్డి తండ్రి గులాబీ జండా మోసిన వ్యక్తి. గతంలో మీరు నన్ను బాధ పెట్టిండ్రు.. ఈసారి ఆలా జరగొద్దు. పాలిచ్చే బర్రెను వదిలి పెట్టి ఎవరైనా దున్నపోతును తెచ్చుకుంటారా?’ అంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి