Share News

TS NEWS: నకిలీ ఫింగర్ ప్రింట్స్ ద్వారా నగదు డ్రా చేస్తున్న ముఠా అరెస్ట్

ABN , First Publish Date - 2023-11-22T15:07:31+05:30 IST

నగరంలో నకిలీ ఫింగర్ ప్రింట్స్ ( Fake Fingerprints ) ద్వారా నగదు డ్రా చేస్తున్న 6 గురు సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు సుమారుగా 10 లక్షలకు పైగా నగదును మోసం చేసినట్లు తెలుస్తోంది.

TS NEWS: నకిలీ ఫింగర్ ప్రింట్స్ ద్వారా నగదు డ్రా చేస్తున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్‌: నగరంలో నకిలీ ఫింగర్ ప్రింట్స్ ( Fake Fingerprints ) ద్వారా నగదు డ్రా చేస్తున్న 6 గురు సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు సుమారుగా 10 లక్షలకు పైగా నగదును మోసం చేసినట్లు తెలుస్తోంది. నిందితుల నుంచి ఫింగర్ ప్రింట్ మిషన్, 8 సెల్‌ఫోన్లు, సిమ్‌ కార్డులు ల్యాప్‌ట్యాప్స్‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసిన అనంతరం సీసీఎస్ జాయింట్ సీపీ గజారావ్ భూపాల్ ( CP GAJARAO BHOPAL ) మీడియాకు వివరాలు తెలిపారు. ‘‘నకిలీ ఫింగర్ ప్రింట్స్ ద్వారా నగదు డ్రా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశాం. మీ సేవ సెంటర్, సబ్ రిజిస్టర్‌ కార్యాలయాలల్లో డేటా తీసుకొని ఈ ముఠా మోసం చేస్తోంది. నిందితులు తీసుకున్న డేటాలో ఫింగర్ ప్రింట్ తీసుకొని ప్రజలను మోసం చేస్తున్నారు. ఆధార్ ఎనేబుల్ సిస్టమ్‌లో ఈ ముఠా వెండర్‌గా లాగినై ఆధార్, సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఈ ఘరానా మోసానికి పాల్పడుతున్నారు.

డేటా తీసుకున్న తర్వాత నకిలీ ఫింగర్ ప్రింటర్స్ సృష్టించి ఈ ముఠా నగదును డ్రా చేస్తున్నట్లు గుర్తించాము. దాదాపు ఈ ముఠా 200 నుంచి 300 లావాదేవీలు జరిపారు. ఈ ముఠా ఈ నకిలీ ఫింగర్ ప్రింట్స్ ద్వారా నాలుగు రోజుల్లోనే 10 లక్షల రూపాయలను డ్రా చేశారు. అసాధారణ, రూపేష్ ఇద్దరు కలిసి సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో డేటాను తీసుకెళ్లారు. మార్చంట్ ఐడీ ద్వారా ఈ ముఠా సభ్యులు లాగినై.. వీరు రబ్బర్ ఫింగర్ ప్రింట్స్ తయారు చేసి వాటి ద్వారా అమౌంట్ డ్రా చేశారు. శ్రీను అనే వ్యక్తికి మార్చంట్ ఐడీ ఇప్పించి ఈ నిందితులు మోసానికి పాల్పడుతున్నారు. శ్రీనుకి జాబ్ ఇప్పిస్తామని చెప్పి, బ్యాంక్ అధికారులతో వీడియో కాల్ చేయించారు. దీంతో శ్రీనుకి ఆధార్ వెరిఫికేషన్ పూర్తి అవ్వగానే మార్చంట్ ఐడీ ఇచ్చారు. శ్రీనుతో పాటు మరికొంత మందికి కూడా ఇలా మార్చంట్ ఐడీలు ఇప్పించి, ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు’’ అని సీపీ గజారావ్ భూపాల్ పేర్కొన్నారు.

Updated Date - 2023-11-22T15:07:32+05:30 IST