Share News

Kishan Reddy: అందుకే రేవంత్ రెడ్డి కామారెడ్డికి వచ్చారు: కిషన్ రెడ్డి

ABN , First Publish Date - 2023-11-27T11:42:25+05:30 IST

హైదరాబాద్: బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి గెలుపు అవకాశాలను దెబ్బతీయాలనే కుట్రతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డికి వచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ విషయాన్ని కామారెడ్డి ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు.

Kishan Reddy: అందుకే రేవంత్ రెడ్డి కామారెడ్డికి వచ్చారు: కిషన్ రెడ్డి

హైదరాబాద్: బీజేపీ అభ్యర్థి (BJP Candidate) వెంకట రమణారెడ్డి (Venkata Ramanareddy) గెలుపు అవకాశాలను దెబ్బతీయాలనే కుట్రతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) కామారెడ్డికి వచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ కామారెడ్డి ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారని, ఇక్కడ బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గెలవబోతున్నారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, యువత, పేదలు, బీసీలు, దళితులు, రైతులు బీజేపీవైపు వున్నారని చాలా స్పష్టమవుతోందన్నారు. ఈనెల 30న జరగనున్న పోలింగ్‌లో భారతీయ జనతాపార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని కిషన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

అవినీతి, కుటుంబ పార్టీలు (కాంగ్రెస్, బీఆర్ఎస్) తెరవెనుక పన్నుతున్న కుట్రలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారని కిషన్ రెడ్డి అన్నారు. పదేళ్ళకు ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఏం చేసిందో, అలాగే బీఆర్ఎస్ కూడా ఏంచేసిందో వాటిపై చర్చ జరపకుండా.. డబ్బులు, మద్యం పంచడం.. మజ్లిస్ పార్టీతో కలిసి బుజ్జగింపు రాజకీయలు చేస్తున్నారని ఆరోపించారు. సాధ్యంకాని హామీలు ఇవ్వడం లాంటి వాటిపై ఆ పార్టీలు నమ్మకం పెట్టుకున్నాయని విమర్శించారు. వాస్తవ విషయాలపై ఈ రెండు పార్టీలకు విశ్వాసం లేదని కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.

Updated Date - 2023-11-27T11:51:40+05:30 IST