Minister Mahender Reddy: తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2023-09-28T19:20:28+05:30 IST

తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం దేశానికే ఆదర్శమని సమాచార, పౌర సంబంధాలు & గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి(Minister Mahender Reddy) వ్యాఖ్యానించారు.

Minister Mahender Reddy: తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం దేశానికే ఆదర్శం

రంగారెడ్డి(చేవెళ్ల): తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం దేశానికే ఆదర్శమని సమాచార, పౌర సంబంధాలు & గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి(Minister Mahender Reddy) వ్యాఖ్యానించారు. షాబాద్ మండలంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు గురువారం నాడు పర్యటించారు. షాబాద్ మండలంలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. షాబాద్ మండలం సీతారాంపురం, చందనవెల్లి పారిశ్రామిక వాడల్లో రూ. 1770 కోట్ల పెట్టుబడులతో చేపట్టనున్న సింటెక్స్‌, టెక్స్ పరిశ్రమల యూనిట్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య , కలెక్టర్ హరీష్ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసిన మంత్రి కేటీఆర్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...‘‘సీఎం కేసీఆర్ దిశా నిర్ధేశంలో ముందుకు సాగుతున్నాం. మంత్రి కేటీఆర్ కృషితో దేశ, విదేశీ పెట్టుబడిదారులు వారి పెట్టుబడులను రాష్ట్రంలో పెట్టడానికి ముందుకు వస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పరిశ్రమల ఖిల్లాగా మారింది. వేల మందికి ఉద్యోగ కల్పన, ఉపాధి అవకాశాల వచ్చాయి.

ప్రపంచ చిత్రపటంలో షాబాద్ మండలానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. 370 కోట్లతో సింటెక్స్ పరిశ్రమలో 1000 మందికి ఉద్యోగాలు కల్పించాం. 1400 కోట్ల పెట్టుబడులతో చిటెక్స్ పరిశ్రమలో 12వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 1358 పరిశ్రమలు ఉన్నాయని 62 వేల 832 కోట్ల పెట్టుబడులతో ఈ పరిశ్రమలను స్థాపించామని వీటిలో 7 లక్షల 6000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వికారాబాద్ జిల్లా లోనూ అనువైన ప్రాంతాలల్లో పరిశ్రమల స్థాపనకు మంత్రి కేటీఆర్‌తో కలిసి భారీ పరిశ్రమల స్థాపన కోసం సీఎం కేసీఆర్‌కు నివేదిస్తాం’’ అని మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-28T19:20:28+05:30 IST