ICDS : విధుల్లో ఇబ్బందులు కల్గిస్తే చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Nov 19 , 2024 | 12:24 AM
అంగనవాడీ సిబ్బంది విధులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు కోరారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్టు ఎదుట నిరసన చేపట్టారు.
ఐసీడీఎస్ ప్రాజెక్టు ఎదుట అంగనవాడీల ఆందోళన
ఽచెన్నేకొత్తపల్లి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): అంగనవాడీ సిబ్బంది విధులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు కోరారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్టు ఎదుట నిరసన చేపట్టారు. సీఐ టీయూ నాయకులు లింగన్న, రమేశ ఆధ్వర్యంలో ప్రాజెక్టు పరిధిలోని అంగనవాడీలు కార్యాల యం ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. విధుల్లో సిబ్బందికి రక్షణ కల్పించా లని వారు కోరారు. సీఐటీయూ నాయకుడు లింగన్న మాట్లాడుతూ... విధులకు వస్తున్న రామగిరి మండలం చెర్లోపల్లి, మంగాపురం అంగనవాడీ కేంద్రాలలో పనిచేసే ఆయాలు లక్ష్మీనరసమ్మ, ఇంద్రజను ఆయా గ్రామాలలో స్థానికంగా కొందరు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. దీంతో వారికి రక్షణ కల్పించాలని కోరారు. సీడీపీఓ కవితాదేవి వారి వద్దకు వచ్చి సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఈ నిరసనలో అంగనవాడీ యూనియన లీడర్లు రమణమ్మ, లక్ష్మి, ప్రసన్న పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....