Share News

THEFTS: వరుస చోరీలతో బెంబేలు

ABN , Publish Date - Nov 11 , 2024 | 12:12 AM

మండలంలో కాసుకో... పోలీస్‌... అంటూ దొంగలు సవాల్‌ విసురుతు న్నారు. తరచూ ఏదో ఒక గ్రామంలో పోలీసులకు పట్టుబడకుండా చోరీలు చేస్తున్నారు. ఇంటి తాళం వేశారా... ఆ ఇల్లు గుల్ల కావల్సిందే. దాదాపు ఐదు నెలల నుంచి జరిగిన చోరీలకు సంబంఽ దించి బంగారం, నగదు కలిపి రూ. కోటీ దాకా లూటీ అయి నట్లు తెలుస్తోంది. వ్యవసాయ పొలాల్లోని పరికాలనూ దొంగలిస్తు న్నారు.

THEFTS:  వరుస చోరీలతో బెంబేలు
Scene of destruction of beer in Chandracharla Kottala (File)

ఫతాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌ ఫ నూతన ఎస్‌ఐకి సవాలుగా...

కనగానపల్లి, నవంబరు 10: మండలంలో కాసుకో... పోలీస్‌... అంటూ దొంగలు సవాల్‌ విసురుతు న్నారు. తరచూ ఏదో ఒక గ్రామంలో పోలీసులకు పట్టుబడకుండా చోరీలు చేస్తున్నారు. ఇంటి తాళం వేశారా... ఆ ఇల్లు గుల్ల కావల్సిందే. దాదాపు ఐదు నెలల నుంచి జరిగిన చోరీలకు సంబంఽ దించి బంగారం, నగదు కలిపి రూ. కోటీ దాకా లూటీ అయి నట్లు తెలుస్తోంది. వ్యవసాయ పొలాల్లోని పరికాలనూ దొంగలిస్తు న్నారు. వరుస చోరీలు ఇటీవల నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఎస్సె మహ్మ్మద్‌ రిజ్వానకు సవాలుగా మారాయని చెప్పవచ్చు.

- మండలంలోని మామిళ్లపల్లి, ముక్తాపురం గ్రామాల్లో ఒకే రోజు రెండు చోరీలు జరిగాయి. ముక్తాపురానికి చెందిన వెంకటనారాయణరెడ్డి ఇంట్లో పది తులాల బంగారం ఎత్తుకెళ్లారు. అదే రోజు రాత్రి మామిళ్లప ల్లిలో జయరామిరెడ్డి భార్య ఆరుబయట నిద్రిస్తుండగా మెడలో ఉన్న మూడు తులాల బంగారం గొలుసును లాక్కెళ్లారు.

- చంద్రాచర్ల కొట్టాల్లో వెంకటాద్రి ఇంట్లో దొంగలు చొరబడి రూ.50లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘ టన జరిగిన నెలలోపే ఆదే గ్రామంలోని రమేశ, శ్రీనివాసులు అనే అన్నదమ్ముల ఇళ్లలో రూ.65 వేలు నగదును ఎత్తుకెళ్లారు. అలాగే మామిళ్లపల్లి సాయిబాబా గుడిలో రెండు సార్లు ఆలయ తలుపులు పగలకొట్టి హుండీలోని నగదును అపహరించారు.

- రాంపురం గ్రామంలో పట్టపగలే రైతుగోపాల్‌ ఇంట్లోకి దూరి రూ.50వేలు నగదును ఎత్తుకెళ్లారు. ఇలా ఏదో ఒక సంఘటన మండలంలోచోటు చేసుకుంటున్నాయి.


- ముక్తాపురం గ్రామంలో వెంకటనారాయణరెడ్డికి ఇంటికి క్లూస్‌టీం వచ్చి వేలిముద్రలను సేకరించుకుని వెళ్లారు. చంద్రాచర్ల కొట్టాలలో ఆగంతుకుడు చోరీ చేస్తున్న దృశ్యం సీసీపుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికి చోరీ కేసులు చేధించడంతో పాటు దొంగతనాలను అరికట్ట డంలో కనగానపల్లి పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు బహి రంగంగా చర్చించుకుంటు న్నారు. ఇది ఇలా ఉండగా మండలంలోని కనగానపల్లి, తగరకుంట, మామిళ్లపల్లి తదితర గ్రామాల ప్రధాన వీధుల్లో పోలీసులు ఏర్పాటుచేసిన సీసీ కెమరాలు పనిచేయడం లేదు. ఇది దుండ గులకు మరింత తోడ్పడుతున్నట్టు తెలుస్తోంది. ఇకనైనా పోలీసు ఉన్నతా ధికారులు స్పందించి సీసీకెమరాలను వినియోగంలోకి తెచ్చి, రాత్రిళ్లు పెట్రోలింగ్‌ నిర్వహిస్తే చోరీలు తగ్గుతాయని ప్రజలు కోరుతున్నారు.

వ్యవసాయ పొలాలను వదలని దొంగలు

ఇళ్లలో చోరీలతో పాటు పంటలను కాపాడుకునేందుకు రైతులు ఏర్పాటుచేసుకున్న వ్యవసాయ పరికరాలను దొంగలు వదలడంలేదు. రైతుల పొలాల్లో ఉన్న స్ర్పింక్లర్‌ పైపులు, డ్రిప్‌ పరికరాలను రాత్రివేళల్లో యథేచ్ఛగా ఎత్తుకెళ్తున్నారు. స్టార్టర్‌ పెట్టెలు, కేబుల్‌ చోరీలు వరుసగా జరుగుతున్నా యి. దీంతో రైతుల పొలాల్లోనే కాపలాకాయాల్సిన పరిస్థితి నెలకొంది. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సె చొరవ తీసుకుని దొంగల ఆట కట్టించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

చోరీలను అరికడతాం - మహమ్మద్‌ రిజ్వాన, ఎస్‌ఐ, కనగానపల్లి

రెండు రోజలు క్రితమే బాధ్యతలు చేపట్టాను. నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు పాటిస్తాం. శాంతి భద్రతలు కాపాడుతూనే చోరీలపై నిఘాం ఉంచుతాం. పని చేయని సీసీ కెమరాలను గుర్తించి సరిచేస్తాం. రాత్రి వేళ పెట్రోలింగ్‌ నిర్వహిస్తాం. ప్రజలకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి దొంగతనాలను అరికడతాం.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 11 , 2024 | 12:12 AM