Share News

arrested : గంజాయి ముఠా అరెస్టు

ABN , Publish Date - Nov 08 , 2024 | 12:43 AM

ఒడిశా నుంచి అనంతపురానికి అక్రమంగా గంజాయిని తరలించి, విక్రయించేందుకు సిద్ధమైన 11 మంది సభ్యుల ముఠాను అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సంఘమిత్ర కాలనీ సమీపంలోని ప్రైవేట్‌ ఫ్లాట్స్‌లో ఉండగా పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీస్‌ కాన్ఫరెన్స హాల్‌లో అదనపు ఎస్పీ రమణమూర్తి ఈ ముఠా వివరాలను తెలిపారు. అరెస్టు చేసిన ముఠా సభ్యులను మీడియాకు చూపించారు. ..

arrested : గంజాయి ముఠా అరెస్టు
ASP Ramanamurthy showing ganja

20 కిలోల గంజాయి స్వాధీనం

అనంతపురం క్రైం, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి అనంతపురానికి అక్రమంగా గంజాయిని తరలించి, విక్రయించేందుకు సిద్ధమైన 11 మంది సభ్యుల ముఠాను అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సంఘమిత్ర కాలనీ సమీపంలోని ప్రైవేట్‌ ఫ్లాట్స్‌లో ఉండగా పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీస్‌ కాన్ఫరెన్స హాల్‌లో అదనపు ఎస్పీ రమణమూర్తి ఈ ముఠా వివరాలను తెలిపారు. అరెస్టు చేసిన ముఠా సభ్యులను మీడియాకు చూపించారు. గంజాయి ముఠాలో కీలక సభ్యుడు దిలీప్‌ బంక. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని


కొరపాట్‌ జిల్లాకు చెందిన దిలీప్‌.. ఆ ప్రాంతంలో పండించిన గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి.. ఆల్టో కారులో అనంతపురానికి తరలిస్తాడు. ముఠా సభ్యులకు కిలో రూ.5 వేలకు విక్రయిస్తుంటాడు. ఇటీవల అరెస్టయిన వజ్రకరూరు మండలం తట్రకట్లు నేతాజీ కూడా ముఠాలో కీలకంగా వ్యవహరించేవాడు. అనంతకు వచ్చిన గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా మార్చుకుని, 20 గ్రాముల ప్యాకెట్‌ను రూ.500 ప్రకారం అమ్మేవాడు. దిలీప్‌ బంకతో పాటు అనంతపురం నగరంలోని నవోదయకాలనీకి చెందిన సాకే వినయ్‌కుమార్‌, డ్రైవర్స్‌ కాలనీకి చెంది సయ్యద్‌ జబ్బార్‌, మారుతీ నగర్‌కు చెందిన రమేష్‌, గుంతకల్లుకు చెందిన భాస్కర్‌, తపోవనానికి చెందిన పప్పూరు జయరాం, నందమూరినగర్‌కు చెందిన సురే్‌షబాబు, రాణినగర్‌కు చెందిన అహ్మద్‌ ఫర్హన, అప్పేచెర్ల మహేంద్ర, గుత్తి రోడ్డులోని చవిటి ప్రదీప్‌, జనశక్తి నగర్‌కు చెందిన తిమ్మాపురం ఇమామ్‌బాషాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 20కిలోల గంజాయి, కారు, రెండు బైక్‌లు, 11 సెల్‌ఫోన్లు, రూ.2500 నగదు స్వాఽధీనం చేసుకున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 08 , 2024 | 12:43 AM