Share News

MLA SUNITA : పంచాయతీల ఆదాయం పెంచాలి

ABN , Publish Date - Nov 09 , 2024 | 12:20 AM

గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపిస్తూ, పంచాయతీల ఆదా యం పెంచడమే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. రాప్తాడు నియోజక వర్గంలోని ఎంపీడీఓలు, ఈఓఆర్‌డీలు, ఎనఆర్‌ఈజీఎస్‌, పీఆర్‌ ఇంజనీర్లతో ఎమ్మెల్యే శుక్రవారం నగరంలోని పరిటాల క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

MLA SUNITA : పంచాయతీల ఆదాయం పెంచాలి
MLA Paritala Sunitha reviewing with officials

అధికారులతో ఎమ్మెల్యే పరిటాల సునీత

రాప్తాడు నవంబరు 8(ఆంధ్రజ్యోతి): గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపిస్తూ, పంచాయతీల ఆదా యం పెంచడమే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. రాప్తాడు నియోజక వర్గంలోని ఎంపీడీఓలు, ఈఓఆర్‌డీలు, ఎనఆర్‌ఈజీఎస్‌, పీఆర్‌ ఇంజనీర్లతో ఎమ్మెల్యే శుక్రవారం నగరంలోని పరిటాల క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా... ఎమ్మెల్యే నియోజకవర్గంలో జరుగుతున్న పనులు, గ్రామాల్లోని సమస్యలపై అధికారులతో చర్చించారు. ముఖ్యమైన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయలన్నారు. గ్రామాల్లో తాగు నీరు, పారిశుధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు. గత ప్రభు త్వంలో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. గ్రామాల్లో సమస్యలు పరిష్కరిస్తూ, పంచా యతీల ఆదాయం పెంచాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రతి ఒక్కరూ ఇంటి గుత్తలు చెల్లించే విధంగా చొరవ తీసుకోవాలన్నారు. పంచాయతీలు, మండ లాల వారీగా చేపట్టాల్సిన పనులపై చర్చించారు. రాప్తాడు నియోజకవర్గం లో రూ. 25 కోట్ల ఉపాధి హామీ నిధులతో మంజూరైన సీసీ రోడ్ల పనులు వేగవంతంగా, నాణ్యంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకంలో అక్రమాలు చోటు చేసుకో కుండా పనులు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 09 , 2024 | 12:20 AM