PHC SUB CENTERS : అద్దె భవనాల్లోనే నిర్వహణ
ABN , Publish Date - Nov 06 , 2024 | 11:53 PM
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించడానికి ఏర్పాటుచేసిన ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనాలు కరువ య్యా యి. అద్దెభవనాల్లో సరైన సౌకర్యాలు లేక ప్రజలు, సిబ్బంది అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల పాత భవనాల్లో, మరికొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఓ మూ లన ఉన్న గదుల్లో ఉప కేంద్రాలను నిర్వహిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో విలేజ్ క్లినిక్ పేరుతో పలు కొత్త భవనాలను మంజూరు చేసినా, వాటి నిర్మాణం అసంపూర్తిగానే నిలిచిపోయింది.
సొంత భవనాలు లేని
ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు
కొన్ని చోట్ల పాఠశాల భవనాల్లోనే...
ఇబ్బందులు పడుతున్న గ్రామీణులు
చెన్నేకొత్తపల్లి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించడానికి ఏర్పాటుచేసిన ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనాలు కరువ య్యా యి. అద్దెభవనాల్లో సరైన సౌకర్యాలు లేక ప్రజలు, సిబ్బంది అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల పాత భవనాల్లో, మరికొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఓ మూ లన ఉన్న గదుల్లో ఉప కేంద్రాలను నిర్వహిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో విలేజ్ క్లినిక్ పేరుతో పలు కొత్త భవనాలను మంజూరు చేసినా, వాటి నిర్మాణం అసంపూర్తిగానే నిలిచిపోయింది. ఒకటి రెండు చోట్ల నిర్మాణాలు పూర్తయినా, భవనాలు ప్రారంభానికి నో చుకోలేదు. గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉండే ఉప కేంద్రాల గురించి అధికారులు పట్టించుకోడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నా యి. మండలంలో మొత్తం 12 ఆరోగ్య ఉపకేంద్రాలు ఉ న్నాయి. అందులో మూడింటికి మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మిగిలిన చోట్ల అద్దె భవనాలు, ప్రభుత్వ పాఠశాలలోని గదుల్లో నిర్వహిస్తున్నారు. మండల కేం ద్రంలో రెండు ఆరోగ్య ఉప కేంద్రాలు ఉండగా ఒకటి అద్దె భవనంలో ఉండగా, మరొకటి స్థానిక బీసీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాల గదిలో నడుస్తోంది. ఏ మాత్రం ప్రజలకు సౌకర్యం లేని పరిస్థితిలో, వాస్త వానికి ఈ ఆరోగ్య ఉపకేంద్రాలు ఎక్కడ ఉన్నాయో చాలామంది స్థానికులకు కూడా తెలియదంటే అతిశయోక్తికాదు. సీకేపీ-1 విలేజి క్లినిక్ నిర్మాణం పునాదులకే పరిమితం కాగా, సీకేపీ-2 కేంద్రాన్ని ప్రారంభించినా, దాన్ని పట్టించుకోకపోవడం తో నిరుపయోగంగా ఉంది. అ లాగే న్యామద్దల- 1, 2 కేంద్రాల తో పాటు ప్యాదిండి గ్రామంలో నూ భవన నిర్మాణం నిలిచిపో యింది. దీంతో అసౌకర్యాల నడుమ అద్దె భవనాల్లోనే ఆరోగ్య ఉప కేంద్రాలు పనిచేస్తున్నాయి.
నెలనెలా అందని అద్దెలు
ఆరోగ్య ఉపకేంద్రాలకు సంబంధించి అద్దె బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతినెల అద్దె బిల్లులు చెల్లించకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదో అవస్థపడి సిబ్బందే యజమాను లకు అద్దెబిల్లులు చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. అర్నెల్ల నుంచి ఏడాది వరకు అద్దెబిల్లులు పెండింగ్లో ఉంటు న్నట్టు తెలిసింది. నెలనెల గండంగా కేంద్రాలను నెట్టుకొస్తున్న ట్టు పలువురు సిబ్బంది వాపోతున్నారు. ఆరోగ్య ఉప కేంద్రాల పరిస్థితిపై చెన్నే కొత్తపల్లి వైద్యాఽ దికారి రవీనాయక్ను వివరణ కోరగా... మండలంలోని ఆరోగ్య ఉపకేంద్రాలు చాలా వరకు అద్దెభవనాలలోనే కొన సాగుతున్నాయని తెలిపారు. అద్దెబిల్లుల విషయంలో కొంత ఆలస్యమైనా చెల్లిస్తు న్నామన్నారు. కొన్నిచోట్ల ప్రభుత్వ భవనాలు మంజూ రైనా నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచి పోయాయని తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....