Share News

TAX : పంచాయతీకి పన్ను ఎగనామం..!

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:10 AM

ఆటో నగర్‌ మెకానిక్‌ షాపుల యజమానులు రాప్తాడు గ్రామ పంచాయతీకి పన్ను చెల్లించ డం లేదు. ఏళ్ల తరబడి కాలయాపన చేస్తున్నారు. పన్ను వసూలు చేయాల్సిన పంచాయ తీ అధికారులు పట్టించుకోలే దు. ఇదిగో చేస్తాం. అదిగో చే స్తాం అంటూ జాప్యం చేస్తున్నారు. దీంతో గ్రామ పంచాయతీ భారీగా నష్టపోతోంది.

TAX : పంచాయతీకి పన్ను ఎగనామం..!
Raptadu Auto Nagar

రాప్తాడు, సెప్టెంబరు 15: ఆటో నగర్‌ మెకానిక్‌ షాపుల యజమానులు రాప్తాడు గ్రామ పంచాయతీకి పన్ను చెల్లించ డం లేదు. ఏళ్ల తరబడి కాలయాపన చేస్తున్నారు. పన్ను వసూలు చేయాల్సిన పంచాయ తీ అధికారులు పట్టించుకోలే దు. ఇదిగో చేస్తాం. అదిగో చే స్తాం అంటూ జాప్యం చేస్తున్నారు. దీంతో గ్రామ పంచాయతీ భారీగా నష్టపోతోంది. ఉమ్మ డి అనంతపురం జిల్లాతో పాటూ పొరుగు జిల్లాల్లోని వాహనదారులు రాప్తాడు సమీపంలో ఏర్పాటైన ఆటో నగర్‌లో వచ్చి వాహనాలను రిపేరీ చేయించుకుని వెళ్తారు. ఆటో నగర్‌ 2010లో రాప్తాడులో ఏర్పాటయింది. ఏపీఐఐసీ సంస్థ సర్వే నెంబర్‌ 554-2 లో 33 ఎకరాల దేవదాయశాఖ భూమిని లీజుకు తీసుకుంది. ఆ భూమిని నబ్‌ లీజుకు ఆటో నగర్‌కు కేటాయించారు.


ఏపీఐఐసీ నిబంధనల ప్రకారం రాప్తాడులో ఆటోనగర్‌ ఏర్పాటు చేశారు. గతంలో అనంతపురంలో వాహనాల రిపేరీ షాపులు ఉండటం వలన ట్రాఫిక్‌ సమస్యలు ఎక్కువ కావడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు నగరానికి దూరంగా మెకానిక్‌ షా పులు ఉండాలని రాప్తాడులో ఆటో నగర్‌ ఏర్పాటు చేశారు. దాదాపు 375 మెకానిక్‌ షాపులు ఏర్పాటు చేశారు. ఇక్కడ షాపులు నిర్వహిస్తున్న మెకానిక్‌లు అందరూ (33 ఎకరాలకు) ఏ పీఐఐసీకి ఏడాదికి లీజు మొత్తం రూ.7 లక్షలు చెల్లించా లి. ప్రతి ఏడాది లీజు మొత్తం చెల్లించడంతో పాటు గ్రా మ పంచాయతీకి కూడా ఏడాదికి ఒక సారి పన్ను, లైసెన్స ఫీజు చెల్లించాలి.


పంచాయతీ అధికారుల లెక్కల ప్రకారం మెకానిక్‌ షాపు విస్త్రీర్ణం బట్టి ఒక్కో షాపుకు ఏడాదికి రూ.600 నుంచి వెయ్యి వరకు చెల్లించాల్సి ఉంది. మూడేళ్ల నుంచి మెకానిక్‌ నిర్వాహకులు పంచాయతీకి పన్ను చెల్లించలేదు. మొత్తం 370కిపైగా షాపులు ఉన్నాయి. ఏడాదికి దాదాపుగా రూ.2 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ లెక్క మూడేళ్లకు 6 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉంది. 375 మెకానిక్‌ షాపుల్లో కేవలం 20 లేదా 30 మంది మాత్రమే ప్రతి ఏడాది పన్ను చెల్లిస్తున్నారు. మిగతా వారు చెల్లించలేదు. దీంతో పంచాయతీ భారీగా నష్టపోతోంది. దీనిపై ఆటోనగర్‌ అధ్యక్షుడు షామీర్‌ బాషాను వివరణ కోరగా పంచాయతీకి పన్ను చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీ కార్యదర్శి అరుణ్‌కుమార్‌ను వివరణ కోరగా... ఇటీవలే పంచాయతీకి ఇనచార్జి కార్యదర్శిగా వచ్చానని ఇప్పటి నుంచి సక్రమంగా పన్ను వసూలు చేస్తామన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 16 , 2024 | 12:10 AM