Share News

Shivaji: ఎన్టీఆర్ ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టారు

ABN , Publish Date - Jan 18 , 2024 | 09:56 PM

తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, మాజీ సీఎం స్వర్గీయ నందమూరి తారక రామారావు ( NTR ) తెలుగు ప్రజల సొత్తు అని.. ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టిన యుగపురుషుడని ప్రముఖ సినీ నటులు శివాజీ ( Shivaji ) తెలిపారు.

Shivaji: ఎన్టీఆర్ ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టారు

అనంతపురం: తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, మాజీ సీఎం స్వర్గీయ నందమూరి తారక రామారావు ( NTR ) తెలుగు ప్రజల సొత్తు అని.. ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టిన యుగపురుషుడని ప్రముఖ సినీ నటులు శివాజీ ( Shivaji ) తెలిపారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా లలిత కళాపరిషత్‌లో గురువారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా సినీనటులు శివాజీ, నాగినీడు హాజరయ్యారు. జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులు నృత్యాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ... యువత పార్టీలోకి రావాలని ఎన్టీఆర్ ఆహ్వానించారని చెప్పారు. తనకు పార్టీలతో సంబంధం లేదని ఎక్కడికైనా వెళ్తానని.. రెండు మంచి మాటలు మాట్లాడుతానని తెలిపారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని శివాజీ కొనియాడారు.

Updated Date - Jan 18 , 2024 | 10:37 PM