Share News

MAIZE CROP : మొక్కజొన్న పంటపై అడవి పందుల దాడి

ABN , Publish Date - Aug 30 , 2024 | 12:25 AM

మండల పరిధిలోని పత్తికుంటపల్లిలో ఉప్పర తిప్పన్న అనే రైతుకు చెందిన పాప్‌కార్న్‌ మొక్కజొన్న పంటపై బుధవారం అర్ధరాత్రి అడవి పందు లు దాడిచేశాయి. దీంతో రూ.లక్ష పంట నష్టం వాటిల్లినట్లు బాఽధిత రైతు తెలిపాడు. ఉప్పర పోతన్నకు గ్రామంలో రెండెకరాల పొలం ఉంది. బోరుకింద మొక్కజొన్న సాగుచేశాడు.

MAIZE CROP : మొక్కజొన్న పంటపై అడవి పందుల దాడి
Crop destroyed by wild boar attack

హిందూపురం(సోమందేపల్లి), ఆగస్టు 29 : మండల పరిధిలోని పత్తికుంటపల్లిలో ఉప్పర తిప్పన్న అనే రైతుకు చెందిన పాప్‌కార్న్‌ మొక్కజొన్న పంటపై బుధవారం అర్ధరాత్రి అడవి పందు లు దాడిచేశాయి. దీంతో రూ.లక్ష పంట నష్టం వాటిల్లినట్లు బాఽధిత రైతు తెలిపాడు. ఉప్పర పోతన్నకు గ్రామంలో రెండెకరాల పొలం ఉంది. బోరుకింద మొక్కజొన్న సాగుచేశాడు. దీనికోసం బాగేపల్లి నుంచి పాప్‌ కార్న్‌ మొక్కజొన్న వ్తితనాలు 8కేజీలను రూ.4వేలు వెచ్చించి తీసుకొచ్చి వితు ్తకున్నాడు. పంటకాలం మూడు నెలలుకాగా అడవి పందుల బెడద ఎక్కువ కావడంతో రేయింబవళ్లు కాపలా ఉంటూ పంటను కాపాడుకుంటూ వచ్చాడు.


ప్రస్తుతం పంట కాత దశలో ఉంది. ఈ సమయంలో అడవి పందుల గుంపు పంటపై దాడి చేయడంతో తీవ్రంగా నష్టపోయానని రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఎకరానికి రూ.లక్ష పెట్టుబడి పెట్టానని, పంట చేతికొచ్చి ఉంటే పెట్టుబడిపోను రూ.2లక్షలు వచ్చి ఉండేదని వాపోయాడు. మార్కెట్‌లో పాప్‌కార్న్‌ క్వింటాల్‌ ధర రూ.12వేలు పలుకుతోందని ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని కోరుతున్నాడు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 30 , 2024 | 12:25 AM