Share News

Atchannaidu: అవి చాలలేదా?.. ఇప్పుడు పేదల భూములు లాక్కుంటున్నారు.. అచ్చెన్న ఆగ్రహం

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:50 PM

Andhrapradesh: వైసీపీ నేతలు 5 ఏళ్ల పాటు ల్యాండ్, శాండ్, వైన్, మైన్‌లో సంపాదించింది చాలక పేదలు భూమలు లాక్కుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి తుమ్మలగుంటలో హాథీరాంజీ మఠం స్థలంలోని పేదల ఇళ్లు కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

Atchannaidu: అవి చాలలేదా?.. ఇప్పుడు పేదల భూములు లాక్కుంటున్నారు.. అచ్చెన్న ఆగ్రహం

అమరావతి, మార్చి 6: వైసీపీ నేతలు (YSRCP Leaders) 5 ఏళ్ల పాటు ల్యాండ్, శాండ్, వైన్, మైన్‌లో సంపాదించింది చాలక పేదలు భూమలు లాక్కుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu)విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి తుమ్మలగుంటలో హాథీరాంజీ మఠం స్థలంలోని పేదల ఇళ్లు కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీడీపీ నేతల్ని (TDP Leaders) గృహ నిర్బంధం చేసి అర్ధరాత్రి వెళ్లి జేసీబీలతో పేదల ఇళ్లు కూల్చుతారా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి (MLA Chevireddy Bhaskareddy) భూకబ్జా రెడ్డిగా మారిపోయారన్నారు. హాథీరాంజీ మఠం స్థలంలో 30 ఎకరాలు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆక్రమించారన్నారు. 2.50 ఎకరాల్లో తన భార్య పేరుతో గెస్ట్ హౌస్ కట్టుకున్నారన్నారు. పేదల స్థలాల లాక్కునేందుకే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ దారుణానికి ఒడిగట్టారని మండిపడ్డారు. పేదల ఇళ్లు కూల్చిన అధికారులకు ఆ పక్కనే ఉన్న ఎమ్మెల్యే బంధువుల ఇళ్లు కనపడలేదా?.. వారి ఇళ్లను ఎందుకు కూల్చలేదని నిలదీశారు. కూల్చిన ఇళ్లు తిరిగి నిర్మించి ఆ స్ధలాలు పేదలకే ఇవ్వాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి..

AP Politics: గుట్టల్ని కొట్టడం, పోర్టులను విక్రయించడం, భూములను మింగడం అని వైఎస్ షర్మిల విసుర్లు

Car Accident Update: పెళ్లి కోసం స్వీడన్ నుంచి వచ్చాడు.. వారం క్రితమే పెళ్లి.. ఇంతలోనే..


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 06 , 2024 | 12:50 PM