Share News

AP Elections: వైసీపీ ఆశలు ఆవిరి.. ఆ నియోజకవర్గంలో వ్యూహం మార్చిన బీజేపీ..

ABN , Publish Date - Apr 21 , 2024 | 01:11 PM

ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఏ నియోజకవర్గంలో గెలుపు ఈజీ.. ఎక్కడ కష్టపడాలో లెక్కలు వేసుకుంటున్నారు. ప్రత్యర్థి కొంచెం వీక్‌గా ఉంటే మన గెలుపు పక్కా అనుకుంటున్నారు. ఈలోపు ప్రత్యర్థి పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. మన మైనస్‌లు అవతల పార్టీకి ప్లస్‌లు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అలాంటి నియోజకవర్గాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి ఒకటి. పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించారు.

AP Elections: వైసీపీ ఆశలు ఆవిరి.. ఆ నియోజకవర్గంలో వ్యూహం మార్చిన బీజేపీ..

ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఏ నియోజకవర్గంలో గెలుపు ఈజీ.. ఎక్కడ కష్టపడాలో లెక్కలు వేసుకుంటున్నారు. ప్రత్యర్థి కొంచెం వీక్‌గా ఉంటే మన గెలుపు పక్కా అనుకుంటున్నారు. ఈలోపు ప్రత్యర్థి పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. మన మైనస్‌లు అవతల పార్టీకి ప్లస్‌లు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అలాంటి నియోజకవర్గాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి ఒకటి. పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించారు. ఆ పార్టీ అభ్యర్థిగా శివరామకృష్ణం రాజును ఎంపిక చేశారు. వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పోటీచేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం, రెడ్డి సామాజికవర్గం అధికంగా ఉండే నియోజకవర్గం కావడంతో ఇక్కడ తమ గెలుపును ఎవరూ ఆపలేరని వైసీపీ నాయకులు భావించారు. మరోవైపు బీజేపీకి నియోజకవర్గంలో సొంత క్యాడర్ తక్కువుగా ఉంది. గెలిచేస్థాయిలో ఇక్కడ పార్టీ బలం లేదనేది బహిరంగ రహస్యం. గతంలో ఏ ఎన్నికల్లోనూ బీజేపీ ఇక్కడ ప్రభావం చూపించలేదు. పొత్తులో భాగంగా కేవలం టీడీపీ, జనసేన ఓట్లపైనే ఈ నియోజకవర్గంలో బీజేపీ ఆధారపడాల్సిన పరిస్థితి. దీంతో అనపర్తిలో తప్పకుండా వైసీపీ గెలుస్తుందనే అంచనాలు వేసుకుంది వైసీపీ.

AP Elections: వైసీపీలో విబేధాలు.. ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి బాగా కలిసొచ్చే ఏకైక నియోజకవర్గం ఇదే..!!


వాస్తవానికి టీడీపీ తొలిజాబితాలోనే ఈ సీటును మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించారు. తరువాత సీట్ల సర్థుబాటులో బీజేపీ ఈ సీటును ఆశించింది. అయితే బలమైన అభ్యర్థిని పోటీలో పెట్టలేకపోయిందనే విమర్శలు వచ్చాయి. మరోవైపు అనపర్తి అసెంబ్లీ స్థానం రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పోటీచేస్తున్నారు. అనపర్తి నుంచి అభ్యర్థిని మార్చకపోతే ఎంపీ స్థానంపై ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ఆ పార్టీ అభ్యర్థిని మార్చాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీచేస్తే తప్పనిసరిగా.. ఇక్కడి నుంచి గెలుపు అవకాశాలు మెండుగా ఉండటంతో పాటు.. గట్టి అభ్యర్థి అవుతారనేది అందరి అంచనా. అయితే అనపర్తి సీటును టీడీపీకి ఇవ్వడానికి బీజేపీ అంగీకరించనట్లు తెలుస్తోంది. ఒకవేళ అనపర్తి వదులుకుంటే దానికి బదులు మరోస్థానం ఇవ్వాలని కోరుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యేలా లేకపోవడంతో అనపర్తి నుంచి బీజేపీనే బరిలో నిలవడం ఖాయమైంది.


అనపర్తి ప్రస్తుత అభ్యర్థి శివరామకృష్ణంరాజు స్థానంలో టీడీపీకి చెందిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పార్టీలో చేర్చుకుని ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే అనపర్తిలో బీజేపీ గట్టి పోటీ ఇవ్వడంతో పాటు గెలిచే సీట్లలో అనపర్తి ఉంటుందనే చర్చ జరుగుతోంది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తారనే ప్రచారం మొదలవ్వడంతో ఇక్కడ వైసీపీ ఆశలు ఆవిరైనట్లు తెలుస్తోంది. రామకృష్ణారెడ్డి అనపర్తి నుంచి కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా ఉంటే టీడీపీ, జనసేన ఓట్లు పూర్తిస్థాయిలో బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డికి పోటీగా ఆ స్థాయిలో వేరే అభ్యర్థి టీడీపీ నుంచి ఎవరూ లేకపోవడంతో.. టీడీపీ క్యాడర్ పూర్తిస్థాయిలో ఆయనకు సహకరించే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరి అనపర్తి నుంచి పోటీచేస్తారా లేదా అనేది ఒకట్రెండు రోజుల్లో తేలిపోనుంది.


ఇప్పటికే చర్చలు పూర్తి..

అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీచేయడం ఖాయమైంది. టీడీపీ అనపర్తి సీటును తీసుకుంటుందా.. లేదా బీజేపీకే ఇస్తే ఆ పార్టీ నుంచి రామకృష్ణారెడ్డిని బరిలో నిలపాలని ఇప్పటికే చర్చలు పూర్తైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ఆమెతో పాటు రామకృష్ణారెడ్డి ఉన్నారు. అలాగే అనపర్తిలో మెజార్టీ రాకుండా రాజమండ్రి ఎంపీ సీటు గెలవడం అసాధ్యమనే అంచనాకు బీజేపీ వచ్చినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే రామకృష్ణారెడ్డిని అవసరమైతే బీజేపీ నుంచి పోటీలో నిలపాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Ramskrishna: వెంకటగిరి టిక్కెట్టు విషయంలో టీడీపీ కీలక నిర్ణయం

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 21 , 2024 | 01:22 PM