Reactor Explosion: రియాక్టర్ పేలుడుపై సీఎం చంద్రబాబు ఆరా..
ABN , Publish Date - Aug 21 , 2024 | 06:25 PM
రాంబిల్లి మండలం అచ్చుతాపురం సెజ్‌లోని ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి వాసంశెట్టి సుభాశ్(Vasamsetti subhash) తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. 25మందికి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులను అనకాపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
అనకాపల్లి: రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి వాసంశెట్టి సుభాశ్(Vasamsetti subhash) తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. 25 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులను అనకాపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రియాక్టర్ పేలడంపై చంద్రబాబు, వాసంశెట్టి ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మంత్రి వాసంశెట్టి సుభాశ్ మాట్లాడుతూ.. ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో ముగ్గురు కార్మికులు చనిపోయారు. ఎగసిపడుతున్న మంటల వల్ల పరిశ్రమ చుట్టుపక్కల భారీగా పొగ కమ్ముకుంది. పరిశ్రమ లోపల ఎంతమంది చిక్కుకున్నారో ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. పవన్ సాయి ఆస్పత్రిలో ఓ కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. బాధిత కుటుంబాలు, కంపెనీతో మాట్లాడి కలెక్టర్ ద్వారా ఎక్స్ గ్రేషియా అందిస్తాం. అక్కడ దట్టమైన పొగ ఉండడంతో ఎంతమంది చనిపోయి ఉంటారనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఉంది. గత ఐదేళ్ల పాలనలో పరిశ్రమల్లోకి థర్డ్ పార్టీ ఏజెన్సీలను రప్పించారు. వారు అధికారం చెలాయించి కంపెనీల్లో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నాం" అని చెప్పారు.
ఈ వార్త కూడా చదవండి:
Reactor Explosion: ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం..