Share News

Leopard: లాలాచెరువులో చిరుతపులి సంచారం.. అప్రమత్తమైన అధికారులు..

ABN , Publish Date - Sep 07 , 2024 | 10:35 AM

లాలాచెరువు(Lala Cheruvu)లో చిరుతపులి(Leopard) కనిపించిన దృశ్యాలు నగరవాసులను హడలెత్తిస్తున్నాయి. ఆల్ ఇండియా రేడియో స్టేషన్ కేంద్రం వద్ద సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డైన దృశ్యాలు స్థానికులను కంటి మీద కునుగు లేకుండా చేస్తున్నాయి.

Leopard: లాలాచెరువులో చిరుతపులి సంచారం.. అప్రమత్తమైన అధికారులు..

రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లాలాచెరువు(Lala Cheruvu)లో చిరుతపులి(Leopard) కనిపించిన దృశ్యాలు నగరవాసులను హడలెత్తిస్తున్నాయి. ఆల్ ఇండియా రేడియో స్టేషన్ కేంద్రం వద్ద సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డైన దృశ్యాలు స్థానికులను కంటి మీద కునుగు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుతపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది.


రాజమహేంద్రవరం లాలాచెరువు పక్కన ఉన్న ఆల్ ఇండియా రేడియో స్టేషన్‌ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు చూసి సిబ్బంది కంగు తిన్నారు. విధి నిర్వహణలో భాగంగా సీసీ ఫుటేజ్ పరిశీలించిన ఉద్యోగులు.. చిరుత పులి కనిపించడం చూసి షాకయ్యారు. ఓ పంది వెనక పులి పడుతున్న దృశ్యాలు అందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్రమత్తమైన రేడియో స్టేషన్ సిబ్బంది వెంటనే పులి సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.


చిరుతపులి వేటకు సంబంధించిన దృశ్యాలను వారికి అందజేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు దాన్ని గుర్తించేందుకు ప్రయత్నాలు మెుదలుపెట్టారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుత సంచారంపై నిఘా పెట్టారు. ఘటన గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే బత్తులు బలరామకృష్ణ.. నియోజకవర్గ ప్రజలకు కీలక సూచనలు చేశారు. పులి సంచారం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చిరుతను త్వరితగతిన పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Tirumala: తిరుమలలో విషాదం.. గుండెపోటుతో మహిళ మృతి..

Nimmala Ramanaidu: కాసేపట్లో బుడమేరు వరద నుంచి బెజవాడ వాసులకు విముక్తి

Ganesh Chaturthi: గణనాధుడికి ఘనంగా పూజలు..

Updated Date - Sep 07 , 2024 | 10:36 AM