Share News

Sand Robbery: ఇసుక మాయంపై మంత్రి వాసంశెట్టి ఆగ్రహం..

ABN , Publish Date - Aug 28 , 2024 | 11:42 AM

ద్రాక్షారామంలో పేదల ఇళ్లస్థలాల లేఅవుట్‌లో ఉంచిన ఇసుకను కేటుగాళ్లు మాయం చేశారు. లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన 70లారీల ఇసుకను రాత్రికి రాత్రే దోచేశారు.

Sand Robbery: ఇసుక మాయంపై మంత్రి వాసంశెట్టి ఆగ్రహం..

కోనసీమ: పేదల ఇళ్ల కోసం నిల్వ చేసిన ఇసుక(Sand)ను రాత్రికి రాత్రే దొంగలు మాయం చేసిన ఘటన ద్రాక్షారామం(Draksharamam)లో చోటు చేసుకుంది. ఇటీవల చంద్రబాబు సర్కార్ ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చింది. దీంతో రవాణా ఖర్చులు మాత్రమే చెల్లించి వేల రూపాయలు ఖర్చు చేయకుండా ఇసుక తెచ్చుకునే అవకాశం ఏపీ ప్రభ్వుతం కల్పించింది. అయితే ద్రాక్షారామంలో పేదల ఇళ్లస్థలాల లేఅవుట్‌లో ఉంచిన ఇసుకను కేటుగాళ్లు మాయం చేశారు.


లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన 70లారీల ఇసుకను రాత్రికి రాత్రే దోచేశారు. ఉదయాన్నే ఇసుక కనిపించకపోవడంతో స్థానికులు విషయాన్ని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ దృష్టికి తీసుకెళ్లారు. ఘటనపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలని గృహనిర్మాణ శాఖ అధికారులను వాసంశెట్టి ఆదేశించారు. కేసు నమోదు చేసి నిందితులను పట్టుకోవాలంటూ మంత్రి సుభాశ్ పోలీసులను ఆదేశించారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Earthquake: శ్రీకాకుళంలో తెల్లవారుజామున స్వల్ప భూకంపం..

Modi Cabinet: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మరో కీలక పరిణామం

Updated Date - Aug 28 , 2024 | 11:57 AM