AP News: ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు.. కారణమిదే..?
ABN , Publish Date - May 19 , 2024 | 09:19 PM
ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై (MLA Rachamallu Sivaprasad Reddy) పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రొద్దుటూరు ఒన్ టౌన్ సీఐ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. శివప్రసాద్ రెడ్డి బావమరిది బంగారు మునిరెడ్డిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐను బెదిరించి, విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.
కడప: ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై (MLA Rachamallu Sivaprasad Reddy) పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రొద్దుటూరు ఒన్ టౌన్ సీఐ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. శివప్రసాద్ రెడ్డి బావమరిది బంగారు మునిరెడ్డిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐను బెదిరించి, విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.
నిన్న (శనివారం) కొందరు వైసీపీ (YSRCP) కార్యకర్తలను పిలిచి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. వైసీపీ కార్యకర్తలను స్టేషన్ నుంచి ఎమ్మెల్యే, అనుచరులు బలవంతంగా తీసుకెళ్లారు. ఈ విషయాన్ని సీఐ సీరియస్‌గా తీసుకున్నారు. విధులకు ఆటంకం కలిగించారని ,బెదిరించారని , సీఐ ఫిర్యా దు మేరకు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. 353 , 506 మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం జగన్‌పై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు
భర్తపై దాడి.. భార్య ప్రతీకారం..
కొడాలి నాని పంచాల్సిన డబ్బులు కొందరు దోచేశారంటూ..
ఇదంతా బురదే కదా అనుకుంటే పొరపాటే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News