Share News

YS Sharmila: వృద్ధుల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం చెలగాటం..

ABN , Publish Date - May 03 , 2024 | 10:38 AM

Andhrapradesh: రాష్ట్రంలో పింఛన్‌ల పేరుతో వృద్ధుల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం చెలగాటమాటమాడుతోందని ఏపీపీసీ ఛీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వృద్ధులను ఒక్కో నెల ఒక్కోరకంగా వీధుల్లోకీడ్చి పొట్టన పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. వృద్ధుల ఉసురు కొట్టుకోవద్దని సీఎస్‌కు సూచిస్తున్నానన్నారు.

YS Sharmila: వృద్ధుల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం చెలగాటం..
APCC Chief YS sharmila Reddy

కడప, మే 3: రాష్ట్రంలో పింఛన్‌ల పేరుతో వృద్ధుల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం (Jagan Government) చెలగాటమాటమాడుతోందని ఏపీపీసీ ఛీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వృద్ధులను ఒక్కో నెల ఒక్కోరకంగా వీధుల్లోకీడ్చి పొట్టన పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. వృద్ధుల ఉసురు కొట్టుకోవద్దని సీఎస్‌కు సూచిస్తున్నానన్నారు. వైసీపీ (YSRCP) నవరత్నాలు నవ సందేహాలుగా మారాయని.. ఉద్యోగులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావని తెలిపారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఉద్యోగులకు ఫ్రీడమ్ ఇవ్వడంతో పాటు కలుపుకుపోయే వారని గుర్తుచేశారు. మరి అయన బిడ్డ జగన్ చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు.

Shamshabad Airport: ఎట్టకేలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చిక్కిన చిరుత..


ఉద్యోగులకు ఇబ్బందులు..

బహిరంగంగా బొత్స లాంటి వారు బెదిరించడం ఏంటి అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారని.. వారి గొంతు నొక్కడం సరికాదన్నారు. ఓపీఎస్ కోసం పోరాడుతూనే ఉన్నారన్నారు. ఏ విషయం తీసుకున్నా ఇవ్వడం లేదని.. ఉద్యోగులను అన్ని విధాలా ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. ఉద్యోగుల హెచ్‌ఆర్‌లోను కోత పెట్టారని విమర్శించారు. 12వ పీఆర్‌సీ కూడా అమలు చేయకుండా కోత పెట్టారన్నారు. ఉద్యోగులను అన్నివిధాలా జగన్ మోసం చేశారని అన్నారు.

Kim Jong Un: ఏడాదికి 25 మంది అందమైన కన్యలతో కిమ్ జాంగ్ ఉన్‌కు ‘ప్లెజర్ స్క్వాడ్’


కాంగ్రెస్ పార్టీ ఓపీఎస్‌ను అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. మేనిపెస్టోకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రాష్టంలో 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. వైసీపీ పార్టీకి మేలు చేయాలని ఇంత ఘోరంగా వ్యవహరించడం దారుణమన్నారు. ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ పార్టీకి అనుకూలంగా పని చెయ్యడం సీఎస్‌కు తగదంటూ వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ అధికారులను తమకు అనుకూలంగా వాడుకోవడం సరికాదని షర్మిల పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌.. కేసీఆర్‌ కోసమే!

Hyderabad: దొంగలున్నారు జాగ్రత్త.. చోరీలు ఎక్కువయ్యేది వేసవిలోనే

Read Latest AP News And Telugu News

Updated Date - May 03 , 2024 | 10:55 AM