Chandrababu:తిరుగుబాటు మొదలైంది.. జగన్ ఇక ఇంటికే: చంద్రబాబు
ABN , Publish Date - Apr 25 , 2024 | 08:01 PM
జంపేటను జిల్లా చేయకుండా ఇక్కడి వారికి సీఎం జగన్ రెడ్డి అన్యాయం చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. రాజంపేటలో గురువారం నాడు అరుదైన కాంబినేషన్ చోటుచేసుకుంది. ఒకే వేదికపై చంద్రబాబు, మాజీ సీఎం, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆసీనులయ్యారు. రాజంపేట సభకు పెద్దసంఖ్యలో కూటమి నేతలు, అభిమానులు తరలివచ్చారు. కార్యకర్తలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
రాజంపేట: రాజంపేటను జిల్లా చేయకుండా ఇక్కడి వారికి సీఎం జగన్ రెడ్డి అన్యాయం చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. రాజంపేటలో గురువారం నాడు అరుదైన కాంబినేషన్ చోటుచేసుకుంది. ఒకే వేదికపై చంద్రబాబు, మాజీ సీఎం, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆసీనులయ్యారు. రాజంపేట సభకు పెద్దసంఖ్యలో కూటమి నేతలు, అభిమానులు తరలివచ్చారు. కార్యకర్తలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సభా ప్రాంగణంలో అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు అవస్థలు పడుతున్నారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP Elctions: ప్రశ్నించిన ప్రజలపై దాడులా?... కొడాలి అనుచరుల వీరంగంపై రాము ఫైర్
ఏపీలో తిరుగుబాటు ప్రారంభమైంది..
జగన్‌పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని చంద్రబాబు అన్నారు. ఆరాచక శక్తులను ఉపేక్షించకూడదన్నారు. ఆస్తులను వైసీపీ నేతలు తీసుకుని సుబ్బారావును వేధించారని మండిపడ్డారు. వేధింపులు భరించలేక రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం కిరణ్‌కుమార్‌రెడ్డిదని తెలిపారు. రాజంపేటలో ఇంత ఉత్సాహాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. ఏపీలో తిరుగుబాటు ప్రారంభమైందని ఉద్ఘాటించారు. ఈ తిరుగుబాటు జగన్‌ను ఇంటికి పంపిస్తుందని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులకు డిపాజిట్లు రాకుండా చేయాలని పిలుపునిచ్చారు.
AP Elections: ఒకేసారి ఆర్డీవో ఆఫీస్‌కు టీడీపీ, వైసీపీ అభ్యర్థులు.. పరిస్థితి ఉద్రిక్తం
రాజంపేటలో విజయోత్సవ సభ పెడతాం..
కూటమిని గెలిపించాలని కోరారు. కూటమి అధికారంలోకి రాగానే రాజంపేటలో విజయోత్సవ సభ పెడతామన్నారు. మీకు జగన్ న్యాయం చేశారా? అని ప్రశ్నించారు. బాధితులకు జగన్ కనీసం ఇళ్లు కట్టించారా? అని నిలదీశారు. అన్నమయ్య డ్యామ్ కట్టించలేని సీఎం.. మూడు రాజధానులు కడతాడరా అని ప్రశ్నించారు. లక్ష్మీప్రసన్న కుటుంబానికి వైసీపీ అన్యాయం చేసిందని మండిపడ్డారు. వారి కుటుంబ ఆస్తులను వైసీపీ నేతలు లాక్కున్నారని ఆరోపించారు. లక్ష్మీప్రసన్న తండ్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తల్లి, సోదరి విషం తాగి చనిపోయారని చంద్రబాబు అన్నారు. వైసీపీకి ఓటేస్తే ఏం జరుగుతుందో ప్రజలంతా ఆలోచించాలని అన్నారు.
Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
మెగా డీఎస్సీపైనే తొలి సంతకం..
రాజంపేట ప్రజల జీవితాలు బాగుపడాలంటే వైసీపీ నేత మిథున్‌రెడ్డి ఓడిపోవాలన్నారు. తాము వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపైనే తొలి సంతకం పెడతామని చెప్పారు. ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగం వచ్చే వరకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని మాటిచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక అన్నమయ్య ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. వైసీపీ పాలనలో నిత్యావసరాల ధరలు బాగా పెరిగాయని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను జైలులో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారని గుర్తుచేసుకున్నారు. ఓట్లు చీలకుండా ఏకతాటిపై ఉండాలని పవన్ ఆనాడు చెప్పారన్నారు. ముస్లింలకు న్యాయం చేసిన పార్టీ తమదని తెలిపారు. రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం కిరణ్‌కుమార్‌రెడ్డిదని చంద్రబాబు తెలిపారు.
వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దాం: పవన్ కళ్యాణ్
జగన్ 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సారా వ్యాపారం చేసుకునే మిథున్‌రెడ్డి తనను ఓడిస్తారట అని విమర్శించారు. యువత తలుచుకుంటే మార్పు ఎందుకు రాదు? అని ప్రశ్నించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిని ఎదుర్కొనే గుండెబలం యువతకు లేదా? అని నిలదీశారు. అన్నమయ్య డ్యామ్ ప్రమాదంలో ఉందని ముందే జగన్ ప్రభుత్వాన్ని తాము హెచ్చరించామని అన్నారు. డ్యామ్‌లో ఇసుక తవ్వేయడం వల్ల 39 మంది చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దామని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొద్దామన్నారు. రాజ్యాధికారం కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉందని... ఇది మారాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
TDP: ఆ సమయంలో ఆస్తులు, స్థలాలపైనే జగన్ చూపు: పట్టాభి
Read Latest Andhra Pradesh News And Telugu News