AP Elections 2024: ‘ఫ్యాన్’ రెక్కలు ముక్కలవడం ఖాయం.. వైసీపీపై చంద్రబాబు పంచ్‌లు..
ABN , Publish Date - May 09 , 2024 | 03:42 PM
ఈ ఎన్నికల్లో వైసీపీపై(YCP) ఉన్న వ్యతిరేకతను ప్రజలు తమ ఓట్ల రూపంలో చూపిస్తారని.. దెబ్బకు వైసీపీ ఫ్యాన్ రెక్కలు ముక్కలవడం ఖాయం అని చంద్రబాబు(Chandrababu) అన్నారు. గురువారం నాడు చంద్రబాబు నాయుడు కురుపాంలో(Kurupam) నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో..
పార్వతీపురం మన్యం, మే 09: ఈ ఎన్నికల్లో వైసీపీపై(YCP) ఉన్న వ్యతిరేకతను ప్రజలు తమ ఓట్ల రూపంలో చూపిస్తారని.. దెబ్బకు వైసీపీ ఫ్యాన్ రెక్కలు ముక్కలవడం ఖాయం అని చంద్రబాబు(Chandrababu) అన్నారు. గురువారం నాడు చంద్రబాబు నాయుడు కురుపాంలో(Kurupam) నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించారు. త్వరలోనే రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. దళిత, గిరిజన ద్రోహి జగన్ అని విమర్శించారు చంద్రబాబు. ఓటేసిన వారిని కాటేసే రకం జగన్ అని ఘాటైన వ్యాఖ్యలతో విమర్శలు గుప్పించారు.
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని విమర్శించారు. 60 శాతం సబ్సిడీతో ట్రైకార్ రుణాలిచ్చేవాళ్లం అని.. ఐదేళ్లలో ఒక్క రూపాయి అయినా జగన్ ఇచ్చారా? అని ప్రశ్నించారు చంద్రబాబు. జగన్ పాలనలో ఏకలవ్య మోడల్ స్కూళ్లను నిర్వీర్యం చేశారని చంద్రబాబు ఆరోపించారు. లేటరైట్ ముసుగులో బాక్సైట్‌ను దోచుకున్నారని ఆరోపించారు. జీవో నెం.3 ద్వారా స్థానికులకే ఉద్యోగాలిచ్చామని.. కానీ జగన్ వచ్చాక జీవో నెం.3ని రద్దు చేశారని విమర్శించారు. అలాంటి వ్యక్తికి ఓటు వేయకూడదు ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ జీవో నెం.3 తీసుకొస్తామని చంద్రబాబు ప్రకటించారు.
ఇదికూడా చదవండి: పంపకాలు ప్రారంభం.. కండీషన్స్ అప్లై..!
కురుపాం ప్రజాగళం సభలో చంద్రబాబు కామెంట్స్ యధావిధంగా..
👉 జగన్ మీ బిడ్డ కాదు..ఏపీకి పట్టిన క్యాన్సర్ గడ్డ
👉 నవరత్నాలు..నవమోసాలు
👉 సూపర్ సిక్స్ పథకాలతో మీ ముందుకొస్తున్నాం
👉 టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం తథ్యం
👉 విద్యుత్ ఛార్జీలతో పాటు అన్ని ధరలు పెంచేశారు
👉 మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు లేవు
👉 మద్యం డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్తున్నాయి
👉 రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత రోడ్డున పడే పరిస్థితి
👉 జాబు రావాలంటే..కూటమి అధికారంలోకి రావాలి
👉 ఉద్యోగం వచ్చే వరకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం
👉 మెగా డీఎస్సీపైనే నా మొదటి సంతకం
👉 ఆడబిడ్డలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం
👉 ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
👉 అన్నదాతకు రూ.20వేల ఆర్థిక సాయం
ఇదికూడా చదవండి: జిల్లాల వారీగా సర్వే వివరాలు ప్రకటించిన గోనె ప్రకాశరావు
జగనన్న భూహక్కు పథకం ప్రతిని చించివేసిన చంద్రబాబు
👉 మీ పాసుపుస్తకంపై జగన్ ఫొటో ఎందుకు వేశారు
👉 మీరు సంపాదించుకున్న భూమిపై జగన్‌కు హక్కు ఉందా?
👉 మన భూములపై జగన్‌కు హక్కు ఏంటని అడుగుతున్నా?
👉 భూములు అమ్మాలన్నా.. కొనాలన్నా వాళ్ల అనుమతి కావాలట?
👉 కళ్లబొల్లి మాటలు వద్దు.. చట్టం రద్దు చేస్తానని చెప్పాల్సిందే
👉 అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దుపైనే రెండో సంతకం