Share News

AP Politics: ఓటమిని తట్టుకోలేకనే విషసంస్కృతికి జగన్ తెర.. రాళ్ల దాడిపై కొల్లు రవీంద్ర

ABN , Publish Date - Apr 15 , 2024 | 10:26 AM

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వేర్వేరు చోట రాళ్ల దాడి ఘటనలకు రాష్ట్రంలో కలకలం రేపాయి. ఈ ఘటనలకు అటు టీడీపీ, ఇటు జనసేన శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తాజాగా రాళ్లదాడిపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర స్పందిస్తూ ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకముందే సీఎం జగన్ రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై జరిగిన రాళ్ల దాడి జగన్మోహన్ రెడ్డి పైశాచికత్వానికి నిదర్శనమన్నారు.

AP Politics: ఓటమిని తట్టుకోలేకనే విషసంస్కృతికి జగన్ తెర.. రాళ్ల దాడిపై కొల్లు రవీంద్ర
TDP Leader Kollu Ravnindra

అమరావతి, ఏప్రిల్ 15: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై (Janasena Chief Pawan Kalyan) వేర్వేరు చోట రాళ్ల దాడి ఘటనలకు రాష్ట్రంలో కలకలం రేపాయి. ఈ ఘటనలకు అటు టీడీపీ, ఇటు జనసేన శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తాజాగా రాళ్లదాడిపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర (TDP Leader Kollu Ravindra) స్పందిస్తూ ముఖ్యమంత్రి జగన్‌పై (CM Jagan Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకముందే సీఎం జగన్ రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై జరిగిన రాళ్ల దాడి జగన్మోహన్ రెడ్డి పైశాచికత్వానికి నిదర్శనమన్నారు. కళ్ల ముందు కనిపిస్తున్న ఓటమిని తట్టుకోలేకనే ఇటువంటి విష సంస్కృతికి జగన్ దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి హింసాత్మక చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిసారించాలన్నారు. కేంద్ర బలగాలను దించకపోతే రానున్న రోజుల్లో వైసీపీ అరాచరాలు మితిమీరే ప్రమాదం ఉందని కొల్ల రవీంద్ర వ్యాఖ్యలు చేశారు.

Alcohol flavours: బీర్ ప్రియులకు ఇక పండగే.. అందుబాటులోకి కొత్త ఫ్లేవర్లు..


అసలేం జరిగిందంటే..

గత రాత్రి విశాఖపట్నం నగర పరిధిలోని పాతగాజువాక జంక్షన్‌లో జరిగిన సభలో చంద్రబాబు పాల్గొన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆయనపై రాయి విసిరాడు. సభ ప్రారంభమైన కొన్ని నిమిషాలకే రాయితో దాడికి పాల్పడ్డారు. అయితే రాయి... చంద్రబాబు వాహనం ముందున్న ఇనుప బారికేడ్‌కు తగిలి కింద పడిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఈ ఘటనపై భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. రాళ్ల దాడిపై చంద్రబాబు సైతం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై క్లెమోర్‌ మైన్స్‌తో దాడి జరిగితేనే భయపడలేదని, రాళ్ల దాడి చేస్తే భయపడతానా? అంటూ మండిపడ్డారు. జగన్‌ సభలకు జనం రావడం లేదని, అందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని.. జగన్‌పై ఎవరో గులకరాయి వేస్తే... తనపై రాళ్లు వేయిస్తారా..? అని చంద్రబాబు ప్రశ్నించారు.

Stock Market: భారీ నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు..సెన్సెక్స్ 636 పాయింట్లు డౌన్


జనసేనానిపై..

మరోవైపు జనసేనాని పవన్‌పై కూడా రాళ్లతో దాడి చేయడం కలకలం రేపింది. గుంటూరు జిల్లా తెనాలిలో వారాహి విజయభేరి కార్యక్రమంలో పవన్‌‌పై ఓ వ్యక్తి రాయి విసిరాడు. అయితే అదృష్టవశాత్త ఆ రాయి పవన్‌కు తగలకుండా పక్కన పడింది. వెంటనే అప్రమత్తమైన జనసైనికులు రాయి విసిరిన వ్యక్తిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.


ఇవి కూడా చదవండి...

TDP: చంద్రబాబుపై రాళ్ల దాడి వెనుక వైసీపీ హస్తం?

Balakrishna: ఉమ్మడి కర్నూలు జిల్లాలో బాలకృష్ణ స్వర్ణాంద్ర సాకార యాత్ర


మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 15 , 2024 | 11:11 AM