Share News

AP Elections: మేనిఫెస్టో అమలుపై సందేహాలుంటే నివృత్తి చేసేందుకు సిద్ధమన్న యనమల

ABN , Publish Date - May 01 , 2024 | 01:26 PM

Andhrapradesh: పూర్తిగా అమలు చేయదగ్గ మేనిఫెస్టోనే తాము రూపొందించామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... తమ మేనిఫెస్టో అమలుపై ఎవరికైనా సందేహాలుంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అనవసరపు ఖర్చులు తగ్గిస్తామని.. ఆదాయాన్ని పెంచుతామన్నారు. అనవసరపు ఖర్చులు తగ్గిచడం ద్వారా సుమారు రూ. 2-3 వేల కోట్లను ఆదా చేయవచ్చని చెప్పుకొచ్చారు.

AP Elections: మేనిఫెస్టో అమలుపై సందేహాలుంటే నివృత్తి చేసేందుకు సిద్ధమన్న యనమల
TDP Leader Yanamala Ramakrishnudu

అమరావతి, మే 1: పూర్తిగా అమలు చేయదగ్గ మేనిఫెస్టోనే (Manifesto) తాము రూపొందించామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు (TDP Leader Yanamala Ramakrishnudu) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... తమ మేనిఫెస్టో అమలుపై ఎవరికైనా సందేహాలుంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అనవసరపు ఖర్చులు తగ్గిస్తామని.. ఆదాయాన్ని పెంచుతామన్నారు. అనవసరపు ఖర్చులు తగ్గిచడం ద్వారా సుమారు రూ. 2-3 వేల కోట్లను ఆదా చేయవచ్చని చెప్పుకొచ్చారు. పన్నులు వేయకుండా.. వ్యవస్థలను స్ట్రీమ్ లైన్ చేయడం ద్వారా ఆదాయం పెంచుతామన్నారు. నాన్ ట్యాక్స్, ఓన్ ట్యాక్స్ రెవెన్యూలు పెరిగేలా ఫోకస్ పెడతామన్నారు. తాము ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి.. గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు ఎక్కువగా వచ్చేలా ప్లాన్ చేసుకుంటామని తెలిపారు.

Janasena: గాజు గ్లాసు గుర్తుపై జనసేనకు కొంత రిలీఫ్..


డివల్యూషన్ ఫండ్స్ షేర్ను 50 శాతం చేయాలనే డిమాండ్ పెట్టి కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. ఐటీ, టూరిజం రంగాలను ప్రొత్సహించడం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రభుత్వం ఐటీ, టూరిజం రంగాలను నాశనం చేసిందని విమర్శించారు. వైద్యారోగ్యానికి ఈ ప్రభుత్వం ఒక్క శాతం కూడా ఖర్చు పెట్టలేదన్నారు. పేదవాడికి కార్పోరేట్ ఆస్పత్రుల్లో సేవలు అందడం లేదని.. ఆరోగ్య శ్రీ బిల్లులు ఇవ్వలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అమల్లోకి రానుందన్నారు. ఈ ప్రభుత్వం అప్పుల కోసం పాకులాడిందని.. తాము ఆదాయం పెంచడంపై దృష్టి సారిస్తామని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

AP Elections: ప్రచారం ఒకరికి.. ఓటు మరొకరికి.. ఆ పార్టీ నేతల్లో గుబులు..

BRS: బీఆర్‌ఎస్‏కు గుర్తుల గుబులు..! రోడ్‌ రోలర్‌, చపాతి మేకర్‌ ఎఫెక్ట్‌ భయం


Read Latest AP News And Telugu News

Updated Date - May 01 , 2024 | 01:50 PM