Share News

Nara Lokesh: సమస్యలపై పోటెత్తిన మెసే‌జ్‌లు.. వాట్సాప్ బ్లాక్

ABN , Publish Date - Jul 11 , 2024 | 03:20 PM

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ మంత్రి నారా లోకేశ్ వాట్సాప్ గురువారం రోజున బ్లాక్ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా లోకేశ్ తెలియజేశారు. సమస్యల గురించి ప్రజలు తన పర్సనల్ మెయిల్‌కు పంపాలని కోరారు. ఆ మెయిల్ తానే చూసి పరిష్కరిస్తానని ప్రకటించారు. మంత్రి నారా లోకేశ్ వాట్సాప్ పనిచేయక పోవడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి.

Nara Lokesh: సమస్యలపై పోటెత్తిన మెసే‌జ్‌లు.. వాట్సాప్ బ్లాక్
Nara Lokesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) వాట్సాప్ గురువారం రోజున బ్లాక్ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా లోకేశ్ తెలియజేశారు. సమస్యల గురించి ప్రజలు తన పర్సనల్ మెయిల్‌కు పంపాలని కోరారు. ఆ మెయిల్ తానే చూసి పరిష్కరిస్తానని ప్రకటించారు. మంత్రి నారా లోకేశ్ వాట్సాప్ పనిచేయక పోవడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. ఏం జరిగిందని టెన్షన్ పడ్డారు. వాట్సాప్ బ్లాక్ అయ్యిందని స్వయంగా లోకేశ్ ప్రకటన చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.


ఏం జరిగిందంటే..?

ఎన్నికల ప్రచార సమయంలో నారా లోకేశ్ జనాలతో కలిసి పోయారు. వచ్చేది తమ ప్రభుత్వమే.. ఏ సమస్య గురించి అయినా సరే ఫిర్యాదు చేయాలని కోరారు. తనను కలిసిన ముఖ్యమైన వారికి నెంబర్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడటం, లోకేశ్ మంత్రి పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. వివిధ సమస్యలు పరిష్కరించాలని మంత్రి లోకేశ్‌కు వాట్సాప్‌లో మెసేజ్ వస్తున్నాయి. వేలాది మంది తమ సమస్యలు పరిష్కరించాలని ఒకేసారి వాట్సాప్ చేశారు. దీంతో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది. లోకేశ్‌కు భారీగా మెసేజ్ రావడంతో వాట్సాప్‌ను మెటా బ్లాక్ చేసింది.


Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. అరెస్ట్‌కు రంగం సిద్ధం..?

ఇప్పుడెలా..!!

సాయం కోసం వచ్చే వారికి తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని నారా లోకేష్ స్పష్టం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతిరోజు ప్రజలను కలుస్తున్నారు. సమస్యలు తెలుసుకునేందుకు ఉండవల్లి నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. వాట్సాప్ బ్లాక్ కావడంతో సమస్యల గురించి తన పర్సనల్ మెయిల్‌ hello.lokesh@ap.gov.inకు పంపాలని సూచించారు. ఆ మెయిల్‌ తానే స్వయంగా చూస్తానని వివరించారు. పాదయాత్రలో యువతకు దగ్గర అయిన హలో లోకేశ్ కార్యక్రమం పేరుతో మెయిల్ ఐడీ క్రియేట్ చేశారు.


మెయిల్ చేయండి..

పేరు, ఊరు, మొబైల్ నంబర్, మెయిల్ ఐడి, సమస్య-సహాయంకు సంబంధించిన పూర్తి వివరాలు వినతులలో పొందుపరచాలని సూచించారు. వాట్సాప్ తరచూ బ్లాక్ కావడంతో ప్రజలు పంపే మెసేజ్‌లు చూసే అవకాశం ఉండటం లేదని, దయచేసి అందరూ మెయిల్ ఐడీకే వినతులు పంపించాలని మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి...

Telangana: బిగ్ షాక్.. ‘రైతుబంధు’పై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం..!

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 11 , 2024 | 05:09 PM