Share News

CM Chandrababu: ఎన్టీపీసీతో చంద్రబాబు సర్కార్ కీలక ఒప్పందం.. 25ఏళ్లపాటు..

ABN , Publish Date - Aug 14 , 2024 | 07:01 PM

ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలపై 300మెగావాట్ల సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఒప్పందం కుదుర్చుకున్నారు.

CM Chandrababu: ఎన్టీపీసీతో చంద్రబాబు సర్కార్ కీలక ఒప్పందం.. 25ఏళ్లపాటు..

అమరావతి: ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలపై 300మెగావాట్ల సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఎన్టీపీసీ- ఆంధ్రప్రదేశ్ నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(ఏపీ నెడ్ క్యాప్) మధ్య ఒప్పందం జరిగినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రకటించారు.


ఒప్పందంలో భాగంగా 2025నాటికి ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలపై సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం ఫలకాలను అమర్చనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. సౌర విద్యుత్ ఉత్పత్తి చేయటంతోపాటు 25ఏళ్లపాటు కర్బన ఉద్గారాలు తగ్గించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ప్రతి యేటా 3.41లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున 25ఏళ్లలో 85.25లక్షల మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించవచ్చని సీఎం తెలిపారు. అలాగే 300మెగావాట్ల విద్యుత్ రూఫ్ టాప్ వ్యవస్థల ఏర్పాటు ద్వారా ఏటా రూ.118.27కోట్లు, 25 ఏళ్లపాటు సుమారు రూ.2,957కోట్ల మేర ఆదా అవుతుందని ఆయన వెల్లడించారు. దీని ద్వారా ఏపీ ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

CM Chandrababu: ఆర్థిక ఇబ్బందులు, పరిష్కారంపై దృష్టి..

Supreme Court: జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌..

Minister Parthasarathy: జోగి రమేశ్ మాటలు అవివేకానికి నిదర్శనం: మంత్రి పార్థసారథి..

Updated Date - Aug 14 , 2024 | 07:34 PM